మహేష్ రొమాంటిక్ వేషాలు.. చాలా రోజుల తరువాత లిప్ లాక్?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ కెరీర్ లోనే మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే రెగ్యులర్ గా కాకుండా కాస్త కొత్త తరహాలో మంచి కామెడీ సినిమా చేసినట్లు కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మహేష్ నెక్స్ట్ సినిమాలో మరింత కొత్తగా కనిపించనున్నాడట. అలాగే రొమాంటిక్ డోస్ కూడా పెంచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video

పరశురామ్ ప్రాజెక్ట్..
సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ చేసిన కామెడీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నెక్స్ట్ పరశురామ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో కూడా మహేష్ కాస్త డిఫరెంట్ లుక్స్ తో కూడా కామెడీ చేస్తాడట. ప్రయోగాలకు తావివ్వకుండా దర్శకుడు పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసేవరకు మహేష్ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. పరశురామ్ కూడా చాలా రోజుల నుంచి హీరోకు నచ్చేలా కథను మలిచాడు.

రొమాంటిక్ డోస్..
మహేష్ బాబు చాలా వరకు రొమాంటిక్ సన్నివేశాల్లో డోస్ పెరగకుండా చూసుకుంటాడు. సినిమాలో అవసరం అయితే గాని లిప్ లాక్ సన్నివేశాలకు ఒప్పుకొడు. ఒకసారి కథకు కమిట్ అయితే దర్శకుడితో బ్లైండ్ గా వెళ్లిపోతాడు అనేది ఇండస్ట్రీలో టాక్. ఇక ఇప్పుడు పరశురామ్ కథ విషయంలో కూడా సూపర్ స్టార్ అలాంటి నిర్ణయమే తీసుకున్నారట. సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు గట్టిగానే ఉంటాయట.

ప్లే బాయ్ వేషాలు..
మహేష్ బాబు తన స్టైల్ కి తగ్గట్టుగా ఒక పర్ఫెక్ట్ ఫ్లే బాయ్ లా కనిపించి చాలా కాలమవుతోంది. ఇక పరశురామ్ మాత్రం తన డైరెక్షన్స్ స్కిల్స్ మహేష్ బాబుని ఒక రొమాంటిక్ ప్లే బాయ్ లా చూపించబోతున్నారట. అయితే వల్గర్ కాకుండా చూసుకోవాలని దర్శకుడికి ముందే తన ఆలోచనను వివరించడట మహేష్. ఇక ఈ స్టార్ హీరో చాలా రోజుల తరువాత లిప్ లాక్ సన్నివేశంలో నటించే అవకాశం ఉన్నట్లు కూడా ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది.

సినిమాను స్టార్ట్ చేయాలని..
లాల్ డౌన్ ముగిసిన తరువాత వీలైనంత త్వరగా సినిమాను స్టార్ట్ చేయాలని మహేష్ బాబు ప్రతిరోజు దర్శకుడితో చర్చలు జరుపుతున్నారట. ఇక అమెరికాలో చేయాల్సిన ఒక షెడ్యూల్ ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు. స్పెషల్ సెట్స్ లో ఇక్కడే షూట్ చేయనున్నారట. ఇక సినిమా టైటిల్ పై కూడా మరికొన్ని రోజుల్లో అఫీషియల్ గా క్లారటీ ఇవ్వాలని మహేష్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











