టాలెంటెడ్ దర్శకుడితో నాగ చైతన్య భారీ ప్రయోగం.. ఒకేసారి మూడు పాత్రల్లో..?

అక్కినేని యువ హీరో నాగ చైతన్య మజిలీ సినిమా నుంచి మెల్లగా సక్సెస్ ట్రాక్ లో పడ్డ విషయం తెలిసిందే. సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న లవ్ స్టొరీపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా కరోనా దెబ్బ పడింది.

సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాను ఎలాగైనా థియేటర్స్ లోనే రిలీక్ చేయాలని నిర్మాతలు టార్గెట్ గా పెట్టుకున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. నాగ చైతన్య మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు థ్యాంక్యు అనే టైటిల్ ని కూడా సెట్ చేసినట్లు రూమర్స్ వస్తున్నాయి. అయితే సినిమాలో నాగచైతన్య నెవర్ బిఫోర్ అనేలా మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడట.

Latest update on naga chaitanya upcoming projects

తన నటనలో కొత్త కోణాన్ని అవిష్కరించేందుకు ఇదే సరైన అవకాశం అని ఫిట్నెస్ లో కూడా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందట. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదట 13B కి సీక్వెల్ గా రూపొందనుందనే కామెంట్స్ చాలానే వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని దర్శకుడు ఒక క్లారిటీ ఇచ్చాడు. దీంతో నాగ చైతన్య అంతకు మించి అనేలా ఎదో కొత్తగా ట్రై చేస్తున్నాడు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక దర్శకుడు విక్రమ్ చివరాగా నానితో గ్యాంగ్ లీడర్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్స్ అందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X