మొత్తానికి బంగార్రాజు సిద్ధమవుతున్నాడు.. మళ్ళీ సంక్రాంతి టార్గెట్?
వయసు ఆరు పదులు దాటినా కూడా టాలీవుడ్ నవ మన్మథుడు అక్కినేని నాగార్జున అనే చెప్పాలి. ఎలాంటి హడావుడి లేకుండా ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ కనిపించే ఆయాన ఆరోగ్య సూత్రం ఏమిటో గాని ఎప్పుడు ఒకే రకమైన ఫీట్నెస్ తో నేటితరం కుర్ర హీరోలకు సవాళ్లు విసురుతూ ఉంటారు. ఇక సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన నాగ్ మరోసారి అదే పాత్రతో ఆకట్టుకోవాలని డిసైడ్ అయ్యాడు.
నాగార్జున కెరీర్ లో చాలా కాలం తరువాత బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా.. 2016 సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమా మంచి వసూళ్లను అందుకుంది. ఇక ఇప్పుడు ఆ సినిమాను డైరెక్ట్ చేసిన కళ్యాణ్ కృష్ణ తోనే బంగార్రాజు టైటిల్ తో సినిమా చేయాలని కథ కూడా సెట్ చేయించాడు. ఈ సినిమా గత ఏడాది నుంచి చర్చల దశలోనే ఉంది. ఇక ఫైనల్ గా ఇటీవల నాగ్ స్క్రిప్ట్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం.

ఇక కళ్యాణ్ కృష్ణ ఇటీవల మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా వేసినట్లు తెలుస్తోంది. మరోసారి అనూప్ రూబెన్స్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారు. ట్యూన్స్ కూడా ఆల్ మోస్ట్ రెడీ అయినట్లేనని తెలుస్తోంది. ఇక నాగార్జున నెక్స్ట్ వైల్డ్ డాగ్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత ప్రవీణ్ సత్తారుతో మరో సినిమా చేయనున్నాడు. దానితో పాటు బంగార్రాజు స్టోరీని మొదలు పెట్టి 2021సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నాగ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











