ఎన్టీఆర్ టైటిల్స్ పై కన్నేసిన పవన్ కళ్యాణ్.. అందులో ఎదో ఒకటి..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. సినిమా అయితే ఇప్పట్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. కరోనా గోల లేకుంటే సినిమా రిలీజ్ కచ్చితంగా వచ్చే ఏడాది మొదట్లోనే ఉండేది. ఎందుకంటే దర్శకుడు క్రిష్ చాలా ప్లానింగ్ తో షెడ్యూల్స్ ని రెడీ చేసుకున్నాడు. కానీ ఆ ప్లాన్స్ మొత్తం తారుమారయ్యాయి.
ఇక ఆ సినిమాకు విరూపాక్ష అనే వర్కింగ్ టైటిల్ ని సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. జానపద సినిమాలను తలపించేలా కథను సెట్ చేసుకున్న క్రిష్ ఇంకా ఆ టైటిల్ ని అయితే పూర్తిగా ఫిక్స్ చేయలేదు. ఇకపోతే ఇటీవల పవన్ కళ్యాణ్ రెండు టైటిల్స్ ని సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కథకు తగ్గట్టుగా ఉండేలా పాత సినిమాల టైటిల్స్ అయితే బావుంటాయని సలహా ఇచ్చారట. అందులో సీనియర్ ఎన్టీఆర్ బందిపోటు - గజదొంగ సినిమా టైటిల్స్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ రెండు టైటిల్స్ లో ఎదో ఒక దాన్ని ఫిక్స్ చేయాలని దర్శకుడు కూడా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే అభిమానుల్లో ఇప్పటికే విరూపాక్షి టైటిల్ బలంగా పాతుకుపోయింది. ఆ టైటిల్ చాలా బావుందని కామెంట్స్ వస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ ఎందుకో ఆ టైటిల్ సినిమా కథకు పూర్తి స్థాయిలో సెట్టవ్వదని మరో విధంగా ఆలోచిస్తున్నారట. ఇక త్వరలో ఈ విషయంపై ఒక నిర్ణయానికి వచ్చి టైటిల్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలని క్రిష్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











