మూడు వందల సంవత్సరాల క్రితం చార్మినార్.. పవన్ కళ్యాణ్ సినిమాలో భారీ బడ్జెట్ తో..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత ఏడాది నుంచి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా కాన్సెప్ట్ కు సంబంధించిన గాసిప్స్ కూడా చర్చనీయాంశంగా మారాయి. దర్శకుడు క్రిష్ భాగ్యనగరాన్ని కూడా మూడు వందల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

సంక్రాంతికి తేవాలని..
సినిమా అయితే ఇప్పట్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. కరోనా గోల లేకుంటే ఏడాది మొదట్లోనే సినిమా రిలీజ్ కచ్చితంగా ఉండేది. ఇక ఇప్పుడు దర్శకుడు క్రిష్ సరికొత్త ప్లానింగ్ తో షెడ్యూల్స్ ని మళ్ళీ రెడీ చేసుకున్నాడు. సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు గాని ఎంతవరకు వర్కౌట్ అవుతుందో టెకీయది.

టైటిల్ పై చర్చలు
ఇక ఆ సినిమాకు విరూపాక్ష అనే వర్కింగ్ టైటిల్ ని సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా హరిహర వీరమల్లు, హరహర మహాదేవ అనే టైటిల్స్ పై కూడా కథనాలు పూట్టుకొస్తున్నాయి. జానపద సినిమాలను తలపించేలా కథను సెట్ చేసుకున్న క్రిష్ ఇంకా ఆ టైటిల్ ని అయితే పూర్తిగా ఫిక్స్ చేయలేదు.

17వ శతాబ్దంలో నడిచే కథ..
ఇక సినిమా కోసం ప్రత్యేకంగా భారీ బడ్జెట్ తో చార్మినార్ సెట్ ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మహేష్ బాబు ఒక్కడు సినిమాలో చార్మినార్ సెట్ ను నిర్మించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అంతకంటే ఎక్కువ బడ్జెట్ లో పవన్ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సినిమా కథ 17వ శతాబ్ద కాలంలో నడుస్తుందట..

త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్
దర్శకుడు క్రిష్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రతి చిన్న విషయాన్ని పక్కా ప్లాన్ తో పూర్తి చేస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ కూడా ఒక సరికొత్త లుక్ తో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ కు సంబంధించిన ఒక కీలక షెడ్యూల్ ని ఇటీవల స్టార్ట్ చేసిన క్రిష్ వీలైనంత త్వరగా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ను అభిమానుల ముందుకు తీసుకు రావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











