ఆది పురుష్ షూటింగ్ మొత్తం అదే ఫార్మాట్.. సీత పాత్రపై త్వరలోనే స్పెషల్ అప్డేట్?
రెబల్ స్టార్ ప్రభాస్ నెవర్ బిఫోర్ అనేలా ఆది పురుష్ సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. బాహుబలి అనంతరం బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకి ఓం రావత్ దర్శకత్వం వహిస్తుండగా T సిరీస్ దాదాపు 250కోట్ల బడ్జెట్ నిర్మించనుంది. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులలో ఇప్పటికే స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్ వచ్చే ఏడాది సినిమా షూటింగ్ ని ముంబైలోనే స్టార్ట్ చేయాలని ప్లాన్ వేసుకుంటోంది.
రామాయణం కథనే 3Dలో రూపొందిస్తున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఈ విషయాన్ని చెప్పకపోయినప్పటికి రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. పైగా సినిమాకు సంబంధించిన విలన్ క్యారెక్టర్ పై కూడా ఇటీవల క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్ లంకేశ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నట్లు చెప్పడంతో అతనే రావణ క్యారెక్టర్ అని అంతా ఫిక్స్ అయ్యారు.

ఇక సినిమా షూటింగ్ కోసం స్పెషల్ గా లొకేషన్స్ వెతకడం అంటే సాధారణ విషయం కాదు కాబట్టి ఎక్కువశాతం VFX వర్క్ మీదనే ఆధారపడి షూటింగ్ చేయనున్నారట. మొత్తంగా ప్రతి షాట్ లో గ్రీన్ మ్యాట్ తప్పనిసరిగా వాడతారట. ఏడు వేల సంవత్సరాల క్రితం నాటి కథను ఎలా తెరకెక్కిస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. రామాయణ కథను రోటిన్ గా కాకుండా సరికొత్త విజువల్స్ తో చూపించగలిగితేనే సక్సెస్ అవుతారు. ఇక స్టోరీ ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి స్క్రీన్ ప్లేతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఇక త్వరలోనే మరొక స్పెషల్ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. సినిమాలో సీత పాత్రను కూడా రివీల్ చేస్తారని టాక్.


Click it and Unblock the Notifications











