రవితేజకు రానా మల్టీస్టారర్ సపోర్ట్.. కష్టాల్లో ఉన్నపుడే బాలీవుడ్ ఎంట్రీ..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బిగ్ బడ్జెట్ సినిమాలు ఏ రేంజ్ లో తెరకెక్కుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక కాస్త బడ్జెట్ పెరిగినా కూడా పాన్ ఇండియా సినిమాలు పూట్టుకొస్తున్నాయి. ఇకపోతే పాన్ ఇండియా లెవెల్లో కాకపోయినా ప్రస్తుతం రానా సహాయంతో రవితేజ బాలీవుడ్ లోకి సరికొత్తగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మలయాళం రీమేక్..
గత కొంత కాలంగా టాలీవుడ్ లో తిరుగుతున్న ఒక రీమేక్ కథకు ఫైనల్ గా హీరోలు దొరికినట్లు తెలుస్తోంది. మలయాళంలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన అయ్యప్పనమ్ కోషియం అనే సినిమా రానా, రవితేజ దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. దర్శకుడు సుధీర్ వర్మ చెప్పిన విధానం రానాకు బాగా నచ్చేసిందట. అందుకే సినిమాను గ్రాండ్ గా నిర్మించాలని నిర్మాతలకు సూచించినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ లో కూడా..
అయ్యప్పనమ్ కోషియం అనే మలయాళం సినిమా తెలుగు రీమేక్ హక్కులను సీతారా ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రీమేక్ గురించి అనేక రకాల రూమర్స్ కూడా వస్తున్నాయి. బాలీవుడ్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని రానా సలహాతో నిర్మాతలు సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారని వినికిడి. రానా రవితేజ ఈ ప్రాజెక్ట్ చేసేందుకు రెమ్యునరేషన్ కూడా తగ్గించినట్లు సమాచారం.

అందులో నిజం లేదట
మలయాళంలో పృథ్వీరాజ్ చేసిన పాత్రలో రానా నటిస్తుండగా.. రవితేజ, బిజూ మీనన్ క్యారెక్టర్ చేయబోతున్నాడట. మొన్నటివరకు వరకు ఈ సినిమాలో రవితేజ చేయాల్సిన క్యారెక్టర్ ఒక మెగా హీరో చేస్తున్నట్లు టాక్ వచ్చింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని సమాచారం.

ఆగస్టులో స్టార్ట్..
ఇక రానా దగ్గుబాటికి సక్సెస్ ట్రాక్ లో ఉన్నప్పటికీ రవితేజ గత కొంత కాలంగా వరుస అపజయలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ రానా కావాలని రవితేజనే తీసుకివాలని నిర్మాతలను రిక్వెస్ట్ చేసినట్లు టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఆ ప్రాజెక్ట్ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో స్టార్ట్ కానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











