సాహో డైరెక్టర్ సుజిత్ ఎంగేజ్మెంట్.. రాబోయే ముఖ్య అతిధులు ఎవరంటే?
టాలీవుడ్ దర్శకుడు సుజిత్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ పెళ్లికి సంబంధించిన వార్తలు ఏ రేంఙ్ లో వైరల్ అవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హీరోలు కమెడియన్స్ నిర్మాతలు అన్ని వర్గాలకు చెందిన వారు పెళ్లి వార్తలతో హాట్ టాపిక్ గా నిలిచారు. ప్రస్తుతం దర్శకుల జాబితా నుంచి సుజిత్ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.

తారల పెళ్లి గోల..
లాక్ డౌన్ లేకపోయి ఉంటే మన స్టార్స్ పెళ్లి వేడుకలు ఒక రేంజ్ లో జరిగి ఉండేవి. మొత్తానికి ఒక నిర్ణయంతో ఎలాగోలా పెళ్లి పనులను పూర్తి చేసుకున్నారు నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్. ముందు నుంచి దిల్ రాజు హడావుడి లేకుండానే పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ నిఖిల్ మాత్రం సినీ స్టార్స్ ని ఇన్వైట్ చేసి గ్రాండ్ గా చేసుకోవాలని అనుకున్నాడు.

సుజిత్ కూడా..
రానా, నితిన్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఊహించని విధంగా యువ దర్శకుడు సుజిత్ కూడా ఆ లిస్ట్ లో చేరిపోయాడు. సాహో సినిమా తరువాత మెగాస్టార్ తో సినిమా చేయడానికి సిద్దమైన సుజిత్ ఆ ప్రాజెక్టు ముందుగానే పెళ్లి చేసుకోవాలని సిద్ధమయ్యాడు. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.

అతిధులు ఎవరంటే..
ఈ నెల 10న గోల్కొండ రిసార్ట్స్ సుజిత్, ప్రవళికల ఎంగేజ్మెంట్ జరగనుంది. దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న కుటుంబ సభ్యులు ఈ వేడుకకు ఎక్కువ మందిని ఇన్వైట్ చేయలేదట. ఉదయం 9గంటలకు స్టార్ట్ కానున్న వేడుకకు కేవలం ఇరువురి కుటుంబ సబ్యులతో పాటు 50మంది అతిధులు మాత్రమే హాజరు కానున్నారట. ఇక సుజిత్ కి దగ్గరైన సినీ ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉందట.

ప్రభాస్ వస్తాడా..
యూవీ క్రియేషన్స్ తో సుజిత్ రన్ రాజా రన్ సినిమాతో పాటు సాహో సినిమా చేశాడు. దీంతో యూవీ నిర్మాతలు, ప్రభాస్ కూడా ఎంగేజ్మెంట్ కి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది. కానీ ఈ విషయంలో అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇకపోతే కరోనా కారణంగా ప్రభాస్ పెద్దగా బయటకు రావడం లేదు. సుజిత్ ఎంగేజ్మెంట్ కి కూడా రాకపోవచ్చనే కామెంట్స్ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











