రూమర్స్ నిజమయ్యేలా ఉన్నాయి.. ఆ హీరోయిన్‌తోనే ఆది పినిశెట్టి పెళ్లి?
హీరోగానే కాకుండా సపోర్టింగ్ యాక్టర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి ఈ మధ్య కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విదంగా ఆది పెళ్లిపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఒక హాట్ హీరోయిన్ తో అతను ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడేళ్ళ నుంచి డేటింగ్ చేస్తున్నట్లు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు టాక్ వస్తోంది.

రూమర్స్ నిజమయ్యేలా ఉన్నాయి
అయితే మొన్నటివరకు అవి రూమర్స్ అనుకుంటే. ఇప్పుడు మాత్రం నిజమయ్యేలా ఉన్నాయని అనిపిస్తున్నట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి అంటే తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో ఫీల్ గుడ్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన తనయుడిగా ఆది పినిశెట్టి ఒకవైపు హీరోగా ట్రై చేస్తూనే మరోవైపు సపోర్టింగ్ రోల్స్ మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇన్నాళ్లు పెళ్లిని దూరంగా పెట్టి..
రంగస్థలం, నిన్ను కోరి వంటి సినిమాల్లో అతను చేసిన పాత్రలకు మంచి క్రేజ్ దక్కింది. అలాగే సరైనోడు సినిమాతో విలన్ గా కూడా క్లిక్కయ్యాడు. ప్రస్తుతం ఆది పినిశెట్టి వయసు 37. అయితే కెరీర్ కోసం ఇన్నాళ్లు పెళ్లిని దూరంగా పెట్టిన ఆది ఫైనల్ గా కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఆ హీరోయిన్ తోనే పెళ్లి..
2017 నుంచి తనతో క్లోజ్ గా ఉంటున్న బెంగుళూరు హీరోయిన్ నిక్కీ గల్రానీని ఆది వివాహం చేసుకోబోతున్నట్లు గత కొంత కాలంగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వీరిద్దరి కలయికలో మరకతమని, మలుపు అనే సినిమాలు వచ్చాయి. ఇక రెగ్యులర్ గా నిక్కీ, పినిశెట్టి ఫ్యామిలీకి దగ్గర కావాదంతో ఇంట్లో వాళ్లకు బాగా నచ్చేసిందట. ఇక త్వరలోనే వీరి వివాహం చెన్నైలో జరిగే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది.
Recommended Video

పుట్టినరోజు వేడుకలో నిక్కీ స్పెషల్ ఎట్రాక్షన్
కొన్ని రోజుల క్రితం ఆది తండ్రి రవిరాజా పుట్టినరోజు వేడుకలో కూడా నిక్కీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అప్పుడే వీరి పెళ్లిపై ఒక నిర్ణయానికి వచ్చిన కుటుంబ పెద్దలు ప్రస్తుతం ముహూర్తాలు సెట్ చేసే పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై ఆది క్లారిటీ ఇవ్వనున్నట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











