For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్,సుకుమార్ చిత్రం గురించి షాకింగ్ న్యూస్

    By Srikanya
    |

    హైదరాబాద్ : టెంపర్ హిట్తో మంచి జోష్ మీద ఎన్టీఆర్ తన నెక్ట్స్ చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 25 వ చిత్రం. ఈ చిత్రాన్ని సుకుమార్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం అఫీషియల్ లాంచింగ్ ని యుకే లో చేస్తున్నట్లు సమాచారం.

    అక్కడ షూటింగ్ రెగ్యులర్ గా జరుపుతాం కాబట్టి అక్కడే లాంచింగ్ పెట్టుకుంటే మంచిదని ఈ నిర్ణయానికి దర్శక,నిర్మాతలు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సుకుమార్ గత చిత్రం 1,నేనొక్కిడినే గ్లోబల్ మార్కెట్ లోనే మనకు ఇక్కడ లోకల్ కన్నా ఎక్కవ కలెక్టు చేయటం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి ఓ కారణం అని చెప్తున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అలాగే అక్కడ ఓ తెలుగు చిత్రం లాంచింగ్ అనేది ఇప్పటివరకూ జరగలేదు కాబట్టి హైలెట్ గా నిలుస్తుంది...అంతేకాకుండా అక్కడ ఉండే మన తెలుగు వారికీ ఆనందం కలిగించినట్లు ఉంటుందని ఎన్టీఆర్ భావించి,గ్రీన్ సిగ్నల్ ఇచ్చిట్లు చెప్తున్నారు. దీంతో ఓవర్ సీస్ మార్కెట్ లో సైతం ఎన్టీఆర్ కు క్రేజ్ పెరిగే అవకాసం ఉంది. జనవరి 8,2016న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ దాకా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

    Launch of NTR-Sukumar Movie at UK?

    ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేయనుంది. జగపతిబాబు కీలకమైన పాత్రలోనూ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోనుంది.

    ఎన్టీఆర్, సుకుమార్ తొలి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రం పూజా కార్యక్రమాలు డిసెంబర్ 18 ఉదయం 11.39 గంటలకు సంస్ధ కార్యాలయం చెన్నైలో జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్, నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, బోగవల్లి బాపినీడు పాల్గొన్నారు.

    దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ... ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్తరం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది. ఈ రోజు ముహూర్తం బాగుండటంతో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం అన్నారు.

    English summary
    Official launch of Sukumar and NTR movie will be made in UK and not in India. This high action entertainer is being produced by BVSN Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X