వకీల్ సాబ్‌తో అందాల రాక్షసి రొమాన్స్.. పవన్ కళ్యాణ్ భామ ఫిక్స్! అందుకోసమే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి కెమెరా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 25 సినిమాలు పూర్తిచేసిన ఆయన.. రెండేళ్ల గ్యాప్ తర్వాత తన 26వ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ మూవీ 'పింక్' సినిమాకు రీమేక్‌గా 'వకీల్ సాబ్' పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లు భాగమవుతుండగా కొత్తగా మరో బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. మరి ఇంతకీ ఎవరా బ్యూటీ? వివరాల్లోకి పోతే..

అంచనాలను రెట్టింపు చేసిన వకీల్ సాబ్f

అంచనాలను రెట్టింపు చేసిన వకీల్ సాబ్f

దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమాకు బోనీకపూర్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ అయింది. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్‌లుక్ విడుదల చేసి మూవీపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశారు మేకర్స్. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

 ముగ్గురు అందాల భామల నడుమ పవన్ కళ్యాణ్

ముగ్గురు అందాల భామల నడుమ పవన్ కళ్యాణ్

'వకీల్ సాబ్' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ముగ్గురు అందాల భామలు నివేదా థామస్, అనన్య నాగేళ్ల, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ ముగ్గురు హీరోయిన్లలో నివేదా థామస్ రోల్ సినిమాకు హైలైట్ కానుందని తెలుస్తోంది. గతంలో ఏ సినిమాలో చూడని విధంగా ఆమె పాత్ర ఉండనుందని సమాచారం.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌.. అందాల రాక్షసి ఎంటర్

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌.. అందాల రాక్షసి ఎంటర్

ఇకపోతే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో మరో హీరోయిన్‌కి ఛాన్స్ ఉంది. అయితే ఈ రోల్ కోసం ఇలియానా, శృతిహాస‌న్ లను చిత్రయూనిట్ సంప్రదించిందని వార్తలు చూశాం. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు ఆ ఇద్దరినీ కాదని అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిని ఓకే చేశారని తెలుస్తోంది. ఇదే నిజమైతే లావణ్యకు ఇది బంపర్ ఆఫరే మరి.

Recommended Video

Celebs Response On Vakeel Saab First Look | Pawan Kalyan | PSPK 26
మెగా అభిమానుల్లో ఆతృత.. అదే చర్చ

మెగా అభిమానుల్లో ఆతృత.. అదే చర్చ

'పింక్' రీమేక్ మొదలైనప్పుడే పవన్ రీ ఎంట్రీని త్వరగా వెండితెరపై చూసేయాలనే కుతూహలం జనాల్లో మొదలైంది. అయితే ఆ కుతూహలాన్ని రెట్టింపు చేసేలా ఈ సినిమాకు 'వకీల్ సాబ్' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసి, పవన్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయడంతో మెగా అభిమానుల్లో ఆతృత మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా వకీల్ సాబ్ గురించిన చర్చలే వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X