ఖరారు:నాగార్జున సరసన అందాల రాక్షసి

By Srikanya

హైదరాబాద్: అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్యా త్రిఫాటి గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఆమె వీరూ పోట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వచ్చిన చిత్రంలోనూ చేసింది. తర్వాత ఆమెకు ఆఫర్స్ కరువయ్యాయి. అయితే ఇప్పుడు ఆమె నాగార్జున సరసన ఖరారు అయినట్లు సమాచారం. నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రంలో కుర్ర నాగార్జున సరసన ఆమె కనిపించనుందని తెలుస్తోంది. మనంలోనూ లావణ్య మెరిసిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

తాత, మనవడు ఈ రెండు పాత్రల్లో నటించి నాగార్జున సరికొత్త వైవిధ్యాన్ని తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించబోతున్నారట. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో తాతపాత్ర చేయబోతున్న నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తారు. మనవడి పాత్ర పోషించే నాగార్జున సరసన హీరోయన్ గా తొలుత తమన్నా అనుకున్నా.. ఆమె పారితోషికం విని షాకయ్యి..లావణ్యా త్రిపాఠి తో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. "సోగ్గాడే చిన్ని నాయన" అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా వివరాలను అక్కినేని జయంతి వేడుకలలో స్వయంగా నాగార్జున ప్రకటిస్తారట.

Lavanya Tripathi to romance Nagarjuna

నాగార్జున మాట్లాడుతూ....ఆష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాలా జంపాలా చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన రామ్మోహన్ తయారు చేసిన కథతో చిత్రం చేస్తున్నా. పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. పల్లెటూరి అనుబంధాలు, ఆప్యాయతలతో ఆద్యంతం ఆహ్లాదకరంగా వుంటుంది. ఇందులో నేను ద్విపాత్రాభినయం చేస్తున్నాను. హలో బ్రదర్ తరహాలో ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే వుంటుంది. ఈ చిత్రంతో కళ్యాణ్ దర్శకుడిగా పరిచయంకాబోతున్నాడు. ఇద్దరూ హీరోయిన్‌లకు స్థానమున్న ఈ చిత్రంలో ఓ కథానాయికగా సీనియర్ నటి రమ్యకృష్ణ ఎంపికైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు సన్‌షైన్ పిక్చర్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తాం అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X