Lavanya Tripathi ఆ విషయంలో నిహారికను ఫాలో అవుతున్న లావణ్య త్రిపాఠి.. నెటిజెన్ల రియాక్షన్ అలా!

అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాధించుకున్న ఈ క్యూట్ బ్యూటీ.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే. 2017లో మిస్టర్ సినిమా కోసం కలిసి పని చేసిన అక్కడే స్నేహితులయ్యారు. ఆ తర్వాత అంతరిక్షం సినిమా కోసం మరోసారి కలవగా.. ప్రేమికులుగా మారారు. చాలా రోజుల పాటు ప్రేమాయణం సాగించిన వీరు రెండు కుటుంబాలకు తమ ప్రేమ విషయాన్ని చెప్పి పెళ్లికి ఒప్పించారు.

పెద్దల అంగీకారంతో ఘనంగా నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాకిచ్చారు. ఇక ఆ తర్వాత నుంచి చకచకా పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇటలీలోని టుస్కానీ నగరంలో నవంబర్ ఒకటో తేదీన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు ఒక్కటికాబోతున్నారు. ఇప్పటికే వీరు పెళ్లి కోసం ఇటలీకి చేరుకున్నారు. అల్లు అర్జున్, స్నేహ, రామ్ చరణ్, ఉపాసన, నిహారిక కొణిదెల, సాయి ధరమ్ తేజ్, పవన్ కల్యాణ్, అన్నా లెజినెవో.. ఇలా ప్రముఖులంతా ఇప్పటికే ఇటలీకీ చేరుకున్నారు. రేపు హల్దీ వేడుక, ఎల్లుండి పెళ్లి జరగబోతుండగా.. తాజాగా మరో న్యూస్ వైరల్ అవుతోంది.

 Lavanya Tripathi Wear Her Mother Saree on Haldi Function Check Details

హల్దీ వేడుకలో లావణ్య త్రిపాఠి తన తల్లిని చీరను కట్టుబోతున్నట్లు తెలుస్తోంది. తల్లి జ్ఞాపకంగా ఉండాలని ఆమె అలా చేస్తుందట. అయితే గతంలో నిశ్చితార్థానికి మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఇలాగే తల్లి చీరను కట్టుకుంది. అయితే బ్లౌజు మాత్రం స్పెషల్ గా డిజైన్ చేయించుకున్న నిహా.. ఆ చీర కట్టుకొని తెగ మురిసిపోయింది. ఇప్పుడు అదే పద్ధతిలో లావణ్య త్రిపాఠి కూడా తన తల్లిని చీరను ధరించాలని అనుకుంటోందట. నేరుగా అలాగే చీరను కట్టుకోకుండా కేప్ లెహంగాలో డిజైన్ చేయించుకున్నట్లు సమాచారం.

అయితే ఘనంగా జరగబోయే హల్దీ వేడుక కోసం.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి తన తల్లి చీరను కట్టుకోవడాన్ని అంతా సమర్థిస్తున్నారు. గతంలో కూడా చాలా మంది స్టార్ హీరోయిన్లు ఇలాగే వారి తల్లుల చీరలను కట్టుకొని మురిసిపోయారు. ముఖ్యంగా బాలీవుడ్ హాట్ బ్యూటీ కరీనా కపూర్, యామీ గౌతమ్, మిహీకా బజాజ్, అలియా భట్.. ఇలా స్టార్ హీరోయిన్లు అందరూ ఇదే పద్ధతి ఫాలో అయ్యారు. ఎన్ని చీరలు ఉన్నా, ఎంత ధర పెట్టినా.. తల్లి చీర ముందు అవేవీ పనికి రావని నిరూపించడంలో వీరిని మించిన వారు లేరు.

 Lavanya Tripathi Wear Her Mother Saree on Haldi Function Check Details

మెగా పవర్ స్టార్ రాణ్ చరణ్, ఉపాసన దంపతులే దగ్గరుండి వీరి పెళ్లి పనులు చూసుకుంటున్నారు. అంతే కాదండోయ్ ఇటలీలోని జరగబోయే వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ కి అతి తక్కువ మంది మాత్రమే హాజరు కాబోతున్నారు. మెగా ఫ్యామిలీతో పాటు త్రిపాఠి, అల్లు ఫ్యామిలీలు.. మరికొంత మంది క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఈ పెళ్లిలో సందడి చేయనున్నారు. ఇక నవంబర్ ఐదో తేదీన హైదరాబాద్ లో ఘనంగా రిసిప్షన్ ఏర్పాటు చేశారు నాగబాబు. ఆరోజే అందరినీ పిలిచి గ్రాండ్ గా రిసిప్షన్ సెలబ్రేట్ చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X