లారెన్స్ కు భారీ ఆఫర్..అంతా షాక్
ముంబై: రెబెల్ డిజాస్టర్ తో నిరుత్సాహంగా ఉన్న లారెన్స్ కు మరో భారీ ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీ టాక్. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని డైరక్ట్ చేసే అవకాసం వచ్చిందని బాలీవుడ్ లో వినపడుతోంది. దాంతో టాలీవుడ్ లో చాలా మంది షాక్ అయ్యారు. అంత పెద్ద స్టార్ హీరోని లారెన్స్ ఎలా ఒప్పించాడనే దిసగా చర్చలు జరుగుతున్నాయి.
ఇక ధనుష్ భార్య..ఐశ్వర్య ఈ ప్రపోజల్ తెచ్చిందని తెలుస్తోంది. అక్షయ్ కుమార్ తో ఆమె ఓ చిత్రం నిర్మించాలని నిర్ణయించకుని ఆయన్ని కలిస్తే..అక్కడ కాంచన ప్రస్దావన వచ్చిందని చెప్తున్నారు. దాంతో ఆమె వెంటనే లారెన్స్ తో కాంచనను హిందీలో చేయటానికి సిద్దమయ్యిందని చెప్తున్నారు. జూన్ నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాసం ఉంది. ప్రస్తుతం లారెన్స్ ..నార్త్ ఆడియన్స్ కు తగినట్లుగా కాంచన స్క్రిప్టులో మార్పులు చేస్తున్నాడని సమాచారం.
మరో ప్రక్క కాంచన చిత్రం ఇప్పుడు 3D లోకి కన్వర్షన్ చేస్తున్నారు. బెల్లంకొండ సురేష్ ఈ విషయం మీడియాకు తెలియచేసారు. త్రిడీలోకి కన్వర్ట్ చేసి రీరిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... మేము ఇప్పటికే ఈ కన్వర్షన్ ప్రాసెస్ ని ప్రారంభించాం. ఇక ఈ 3D వెర్షన్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా లారెన్స్ పై ఓ పాటను చిత్రీకరించి కలుపుతున్నాం..ఈ సినిమా గ్యారెంటీగా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో రాఘవలాన్స్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన చిత్రం 'కాంచన'.


Click it and Unblock the Notifications











