హాట్ టాపిక్: లారెన్స్ ని కాపీ కొట్టిన 'కెమెరామెన్ గంగ తో ...'
హైదరాబాద్ : పరిశ్రమలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటీ అంటే ...పూరీ జగన్ పూర్తిగా లారెన్స్ ప్రబావానికి లోనయ్యారా అనేదే. స్టార్ హీరోల డేట్స్ పట్టడం, కథ లేకుండా సినిమాలు తీయటం, నిర్మాతలపై రెమ్యునేషన్ విషయంలో కంప్లైంట్స్ ఇవ్వటమే కాకుండా ఇప్పుడు తాజాగా ఫైట్స్ విషయంలోనూ ఆయన్ని అనుకరిస్తున్నాడంటున్నారు. లారెన్స్ తాజా చిత్రం రెబెల్ లో వచ్చిన హిజ్రా ఫైట్(మగవాళ్లకు చీరలు కట్టి ఫైట్) పూరీ జగన్ తన తాజా చిత్రం కెమెరామెన్ గంగతో పెట్టడంతో అంతటా చర్చనీయాంశమైంది. రెబెల్ ప్లాపైంది కాబట్టి పెద్దగా పట్టింపు లేదు కానీ లేకపోతే ఈ ఫైట్ గ్యారెంటీగా మీడియాలో కూడా చర్చగా మారేదంటున్నారు.
పవన్ కళ్యాణ్ తో పూరీ రూపొందించిన కెమెరామెన్ గంగలో ...సెకండాఫ్ లో హీరోపై లేడీ విలన్ హిజ్రాలని రంగంలోకి దించి ఫైట్ కి దిగుతుంది. ఆడవాళ్లపై దాడిగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తే హీరో రాంబాబు దాన్ని తిప్పి కొడతాడు. మీడియా ఎదురుగా వారంతా మగవారేనని నిరూపిస్తాడు. ఇక ప్రభాస్ రెబెల్ లో విలన్స్ ..హీరో ని ఎదుర్కోవటానికి సెకండాఫ్ లో హిజ్రాలను దింపుతారు. అక్కడ పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ ని లారెన్స్ హైలెట్ గా చెప్పుకొచ్చాడు. ఇప్పుడా ఫైట్ ని పూరీ కాపీ కొట్టాడని అంటున్నారు.
మరో ప్రక్క రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాలు రెమ్యునేషన్ విషయంలో వివాదాల్లో ఇరుక్కున్నారు. లారెన్స్ కథ చెప్పినపుడు, సినిమా నిర్మాణం సాగదీసినపుడు కిమ్మనకుండా వున్న నిర్మాతలు, అదికాస్తా పూర్తయి, ఫెయిల్యూర్ అయ్యాక, నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసారు. పనిలో పనిగా దర్శకుడు లారెన్స్ తనూ దర్శకుల సంఘంలో ఓ ఫిర్యాదు పడేసాడు. అనువాద హక్కులు ఎగ్గొట్టారంటూ. అదే విధంగా దర్శకుడు పూరి జగన్నాథ్ తనకు రావాల్సిన బాకీ ఎగ్గొట్టారంటూ కెమెరామెన్ గంగతో రాంబాబు నిర్మాతలపై ఓ ఫిర్యాదు పడేసాడు. ఇలా ఈ రెండు సినిమాలు రిజల్ట్ విషయంలోనే కాక మిగతా విషయాల్లోనూ ఒకదానిని మరొకటి అనుకరిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











