లారెన్స్ పై ప్రేక్షకుల పెదవి విరుపులు!
మీరు చదివింది నూటికి నూరుపాళ్లూ నిజం. కాకుంటే ఇప్పుడు మనం ప్రస్తావించబోయేది బాలయ్య నటించిన 'సింహా" చిత్రం గురించి కాదు. 'సింహా" పాత్రలో లారెన్స్ నటించిన 'సూపర్ కౌబాయ్" సినిమా గురించి. ఒక ప్రక్క నందమూరి బాలకృష్ణ నటించిన 'సింహా" ఆంద్రారాష్ట్రానంతా అదరగొడుతుంటే మరో ప్రక్క అదే పేరుగల పాత్రలో 'సూపర్ కౌబాయ్" కనిపించి లారెన్స్, ప్రేక్షకులను బెదరగొడుతున్నాడు. సినిమా అంతా పెద్దగా ఎక్స్‌ప్రెషన్స్ ఏమీ ఇవ్వకుండానే లాగించేయడం లారెన్స్‌కు అలవాటు.
కౌబాయ్ పాత్రకు ఒక గ్రేస్ ఉన్న నటుడైతే ఆ పాత్రకే అందం వస్తుంది. తెలుగులో అప్పుడెప్పుడో మొదట కృష్ణని, ఆ తరువాత చాలా రోజులకీ చిరంజీవినీ చూశాం. కొద్ది సంవత్సరాల క్రితం ప్రిన్స్ మహేష్ బాబుని చూశాం. ముగ్గురూ ఆ పాత్రలకి న్యాయం చేయడమే కాకుండా, ముగ్గురికి ముగ్గురు కౌబాయ్ అంటే ఇలానే ఉంటాడేమో అనే భ్రమను కలిగించారు. అంతగా ఆ కౌబాయ్ పాత్రలో ఒదిగిపోయారు.
నటనలో అనుభవం, వైవిధ్యం రెండూ పెద్దగా లేని లారెన్స్ ఏ ధైర్యం తోటి ఈ ప్రయోగం చేసాడోగానీ, ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం ఎందుకొచ్చిన గొడవరా బాబూ అంటూ సినిమా హాలు బయటకు పరుగులు తీస్తున్నారు. ఎక్కడ చూసిన ప్రేక్షకుల పెదవి విరుపులే.


Click it and Unblock the Notifications











