లారెన్స్ కు అంత రెమ్యునేషనా?
కాంచన సినిమాతో హిట్ కొచ్చిన రాఘవ లారెన్స్ కు ఇప్పుడు తెలుగు,తమిళ భాషల్లో డిమాండ్ క్రియేట్ అయ్యిందనేది వాస్తవం.అయితే దాన్ని సాధ్యమైనంతవరకూ లారెన్స్ క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు పరిశ్రమలో వినపడుతోంది.వారు చెప్పుకునేదానిప్రకారం లారెన్స్ ఇప్పుడు తన డైరక్షన్ కోసం మూడు కోట్లు రెమ్యునేషన్ డిమాండ్ చేస్తున్నాడని చెప్తున్నారు.అలాగే నిర్మాతలు కూడా తన స్క్రిప్టులో కానీ,తన డైరక్షన్ లో కానీ వేలు పెట్టకూడదని,ప్యాకేజ్ అయితే ఇంకా బెటరని కండీషన్ గా చెప్తున్నాడని వినపడుతోంది.బెల్లంకొండ సురేష్ అతనితో సినిమా చేయటానికి ముందుకు రాగానే ఈ కండీషన్ చిట్టా విప్పాడని చెప్పుకుంటున్నారు.అయినా రవితేజ కోసం అతను చెప్పిన కథ నచ్చి ఫుల్ మీల్స్..హండ్రెడ్ పర్శంట్ మాస్ అనే టైటిల్ తో సినిమా తీయటానకిి రెడీ అవుతున్నాడు.
లారెన్స్ ను పెట్టుకుంటే మేజర్ విబాగాలైన నటన,దర్శకత్వం,కొరియోగ్రఫీలకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.లారెన్స్ కూడా తాను సినిమాకు దర్సకత్వంల వహించటమే కాకుండా ఓ కీలకమైన క్యారెక్టర్ కూడా చేస్తానని,అలాగే కొరియోగ్రఫీ చేస్తానని,కథ,స్క్ర్రీన్ ప్లే తనే రాసుకుంటానని, కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఆ మాత్రం రెమ్యునేషన్ అడుగుతున్నానని డిమాండ్ చేస్తున్నాడని వినికిడి.అయితే మరి ఆ రేంజి కండీషన్స్ కు ఎవరు ఒప్పుకుని అతనితో ప్రయాణం సాగిస్తాడనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి కలుగుతున్న ప్రశ్న.ప్రస్తుతం లారెన్స్..రెబెల్ చిత్రం బిజీలో ఉన్నాడు.ప్రభాస్,అనూష్క కాంబినేషన్ లో రూపొందుతున్న ఆ చిత్రం పక్కా మాస్ మశాలా చిత్రం అని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











