మళ్లీ లారెన్స్ తో నాగ్..టైటిల్ ఏమిటంటే..
ప్రస్తుతం లారెన్స్ 'కాంచన 'సీక్వెల్ లో బిజీగా ఉన్నారు. 'రెబెల్ 'డిజాస్టర్ కావటంతో తెలుగులో ఎవరూ లారెన్స్ ను ఎంకరేజ్ చేయరని భావించారు. అయితే ఊహించని విధంగా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ నాగ్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే పూర్తి స్క్రిప్టు విన్న తర్వాతే మిగతా విషయాలు ఆలోచిద్దామని చెప్పినట్లు చెప్తున్నారు.
ఇక నాగార్జున ప్రస్తుతం 'భాయ్'షూటింగ్ లో బిజిగా ఉన్నారు. యాక్షన్ కామెడీగా రూపొందుతున్న నాగార్జున తాజా చిత్రం 'భాయ్' . పూలరంగడు,అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం ఇటీవలే యూరప్‌లోని స్లోవేనియా, ఇటలీల్లో నాగార్జున, రిచా గంగోపాధ్యాయలపై బృంద నృత్య దర్శకత్వంలో రెండు పాటల్ని షూట్ చేసుకుని వచ్చింది.
ఈ షెడ్యూల్ తో షూటింగ్ 50 శాతం పూర్తయింది. ఈ నెల 28 నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్ మొదలవుతుంది. అన్నపూర్ణ స్టూడియోలో కోటీ యాభై లక్షల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన ఓల్డ్ సిటీ సెట్‌లో కీలక సన్నివేశాలను తీస్తారు.


Click it and Unblock the Notifications












