For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లక్ష్మీరాయ్ స్పందన: ధోనీతో ఎఫైర్ ఇష్యూ చూపిస్తారనే భయం?

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: ప్రముఖ టీమిండియా క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ జీవితంపై సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. 'ఎమ్మెస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' టైటిల్ తో ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుంది.

  దేశ వ్యాప్తంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. సినిమాను ప్రమోట్ చేయడానికి చిత్ర బృందంతో పాటు ధోనీ కూడా రంగంలోకి దిగడంతో అందరిలోనూ ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఆల్రెడీ తెలుగు, తమిళంలో జరిగిన ఆడియో రిలీజ్ వేడుకకు ధోనీ హాజరైన సంగతి తెలిసిందే.

  తెరపైకి లక్ష్మిరాయ్

  తెరపైకి లక్ష్మిరాయ్

  కాగా.... ఉన్నట్టుండి హీరోయిన్ లక్ష్మీరాయ్ పేరు తెరపైకి వచ్చింది. ధోనీ జీవితం గురించి సినిమా వస్తున్న నేపథ్యంలో అతనితో ఎఫైర్ నడిపిందంటూ గతంలో వార్తల్లో నలిగిన లక్ష్మీరాయ్ గురించి కూడా సినిమాలో ఉంటుందా? అనేది చర్చనీయాంశం అయింది.

  2008లొ ఏం జరిగింది?

  2008లొ ఏం జరిగింది?

  2008లో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ జట్టుకు లక్ష్మీ రాయ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. ఆ సమయంలో లక్ష్మీ రాయ్ ధోనీతో ఎఫైర్ పెట్టుకుందని, ఇద్దరూ అప్పట్లో ప్రేమలో మునిగి తేలారని, రొమాన్స్ చేసుకున్నారని పుకార్లు షికార్లు చేసాయి.

  లక్ష్మీరాయ్ స్పందన

  లక్ష్మీరాయ్ స్పందన

  చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సమయంలో ధోనీతో పరిచయం నిజమే. ఎఫైర్ లో నిజం లేదు, మేమెప్పుడూ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఆ ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ధోనీతో టచ్ లో లేను అన్నారు లక్ష్మిరాయ్.

  సినిమా కథ గురించి ఎంక్వయిరీ చేసా

  సినిమా కథ గురించి ఎంక్వయిరీ చేసా

  2008లో పుకార్లు వచ్చాయి. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఎందుకు దీన్ని రాద్దాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదు. నేను ఈ సినిమా స్టోరీ తెలుసుకునేందుకు ఎంక్వయిరీ చేసాను. సినిమాలో అలాంటి సీన్లు ఉన్నట్లు నా దృష్టికి రాలేదు అని లక్ష్మీ రాయ్ తెలిపారు.

  ధోనీకి లవర్ ఉంది, సినిమాలో సీన్ ఉంది

  ధోనీకి లవర్ ఉంది, సినిమాలో సీన్ ఉంది

  రియల్ లైఫ్ లో ధోనీకి లవర్ ఉంది. ఆమె పేరు ప్రియాంక ఝా. అయితే ఆమె యాక్సిడెంటులో మరణించింది. తర్వాత ధోనీ సాక్షి రావత్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

  ఇదే తొలిసారి

  ఇదే తొలిసారి

  ఒక క్రికెటర్ జీవితంపై సినిమా రావడం... అది అతని రిటైర్మెంటుకు ముందే రిలీజ్ అవ్వడం ఇదే తొలిసారి. ధోని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఎక్కడో జార్ఖండ్ రాష్ట్రలో మామూలు మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఇద్ద పెద్ద క్రికెట్ స్టార్ గా ఎదగడం వెనక చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ సినిమాలో చూపించబోతున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లీషులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమా వేలాది థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

  రిలీజ్ డేట్

  రిలీజ్ డేట్

  సెప్టెంబర్ 30న ఈ సినిమా సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుంది. 80 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందే మంచి శాటిలైట్ రైట్స్ ని సంపాదించుకుంది. సినిమాను సాధ్య‌మైనంత స‌హ‌జంగా తీసేందుకు కొన్ని రియ‌ల్ లొకేష‌న్ల‌లో చిత్రీక‌రించారు.

  సుశాంత్

  సుశాంత్

  సుషాంత్‌ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను నీరజ్‌ పాండే డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే అనూహ్య స్పందన వచ్చింది.

  నిజమా? పుకారా?

  నిజమా? పుకారా?

  కాగా... తన జీవిత కథను సినిమాగా తీసినందుకు ధోనీ రూ. 60 కోట్ల వరకు చార్జ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత భారీ మొత్తంలో ధోనీ చార్జ్ చేయడం చర్చనీయాంశం అయింది. అయితే ఈ మొత్తం ఆయనకు ముందే చెల్లించారా? లేక సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభాల నుండి ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

  ధోనీ భార్య

  ధోనీ భార్య

  ఈ సినిమాలో ధోనీ భార్య పాత్రలో కైరా అడ్వాణీ నటించారు.

  English summary
  Laxmi rai about Dhoni movie. Some relationships just refuse to die. It's been a good five years since actor Lakshmi Rai has broken up with cricketer MS Dhoni, but she says she still keeps stumbling upon reports that talk about their affair and she hates it.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X