ఆమెకు బాలకృష్ణే పెద్ద దిక్కు
కాంచనమాల కేబుల్ టివీతో తెలుగు తెరకు పరిచయమైన సుందరి లక్ష్మీ రాయ్. ఆ తర్వాత ఇక్కడ పెద్దగా ఆఫర్స్ రాలేదు. ఆ తర్వాత తమిళ,కన్నడ చిత్రాలు చేసినా గుర్తింపు రాలేదు. దాంతో లారెన్స్ ను పట్టుకుని అతని సినిమాల్లో వేషాలు సంపాదించింది. అయితే లక్కిగా ఆమెకు 'కాంచన' చిత్రం బ్రేక్ ఇచ్చింది. మరో ప్రక్క తమిళంలో ఆమె నటించిన 'మంగాత్త' కూడా హిట్టయ్యింది. ఈలోగా ఆమె తెలుగులో బాలకృష్ణ సరసన 'అధినాయకుడు'చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ దొరికింది. దాంతో ఈ చిత్రంపై లక్ష్మీరాయ్ తెగ అంచనాలు పెంచేసుకుంటోంది. ఈ చిత్రం హిట్టవుతే అవకాశాలు మరిన్ని వెతుక్కుంటూ వస్తాయని భావిస్తోంది లక్ష్మీరాయ్.
మరో ప్రక్క బాలకృష్ణను ఇక్కడ తన మార్కెట్ విస్తరించుకోవటానికి ఉపయోగించుకోవాలనుకుంటోంది. అందులో భాగంగా ఆయన పరిచయాలు ఉన్నవాళ్ళతో ఆమె తన వేషాలు గురించి అడుగుతోంది. అవసరమైతే బాలయ్య ఓ ఫోన్ చేస్తారనే ధీమాలో ఉంది. బాలకృష్ణ కూడా చాలా ఎంకరేజింగ్ గా ఆమెకు సహకరిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. అయితే 'అధినాయకుడు'హిట్ అయ్యేదాకా ఆగమని ఆమెకు చెప్పినట్లు చెప్పుకుంటున్నారు. ఏదైమైనా ఆమెకు ఇప్పుడు బాలకృష్ణ తెలుగు ఫీల్డ్ లో పెద్ద దిక్కు. ఆయన అండతో ఎక్కడికి దాకా వెళ్తుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











