శేఖర్ కమ్ముల 'లీడర్' ట్రైలర్ రిజక్ట్ అయింది
రాణాని హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్మల ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న లీడర్ చిత్రం రెండో ట్రైలర్ ని సెన్సార్ వారు రిజక్ట్ చేసారు. అందుకు కారణం..ఆ ట్రైలర్ లో నిజ జీవితంలోని రాజకీయ నాయకుల వాయిస్ లను (అసెంబ్లీ వాతావరణం)పెట్టడం జరిగింది. దాంతో ఇప్పుడు ఎటువంటి కాంట్రావర్శీలు రాని మరో ట్రైలర్ ని రూపొందించే పనిలో ఉన్నారు. ఎవియం ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా భావించి ఈ వారసుడు చిత్రం రూపొందిస్తున్నారు. నవంబర్ ఇరవై రెండున ఈ చిత్రం ఆడియో రిలీజ్ అవుతుంది. మిక్కీ.జె.మేయర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇక ఈ చిత్రంలో రాణా తన తండ్రి మరణిస్తే..ముఖ్యమంత్రి అయ్యే పాత్రను పోషిస్తున్నాడని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం డిసెంబర్ 24న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. హ్యాపీడేస్ అనంతరం శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రం కావటంతో అంతటా మంచి అంచనాలే ఉన్నాయి.
శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ ఆనంద్ లీడర్ రాణా ఎవియం సెన్సార్ మిక్కీ జె మేయర్ shekar kammula happy days anand leader raana


Click it and Unblock the Notifications