బిగ్‌బాస్ నుంచి భానుశ్రీ అవుట్! కౌశల్ దెబ్బ పడింది. కిరిటీ దారిలోనే.. మరో లీక్ వైరల్

By Rajababu

బిగ్‌బాస్ అంటేనే సీక్రెట్. చివరి క్షణం వరకు అంతా సస్పెన్సే ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో ప్రతీ విషయం ముందే తెలిసిపోతున్నది. బిగ్‌బాస్‌పై ఉండే ఆసక్తిని కోల్పోయేలా చేస్తున్నది. సాధారణంగా శనివారం జరిగే గేమ్‌లో ఎవరు సేఫ్ అయ్యారనే విషయాన్ని చెబుతారు. కానీ నామినేషన్‌లో ముగ్గురే ఉండటంతో ఒకరు సేఫ్ అయితే మిగిలిన ఇద్దరిలో ఒకరు అవుట్ కావడమన్న విషయం ఈజీగా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే షో మీద ఆసక్తిని కోల్పోకుండా ఎలిమినేషన్ ప్రక్రియను ముట్టుకోలేదని విషయం బోధపడింది.

కౌశల్‌పై భానుశ్రీ అసత్య ఆరోపణలు

కౌశల్‌పై భానుశ్రీ అసత్య ఆరోపణలు

నాలుగోవారంలో భానుశ్రీ ఎలిమినేట్ అయిందనే విషయం పక్కాగా తెలుస్తున్నది. తన టీషర్టులో చేయి పెట్టారని అసత్య ఆరోపణలు చేసింది. ఆ తర్వాత తాను తప్పుగా మాట్లాడాని సారీ చెప్పింది. ఈ విషయంలో భానుశ్రీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందనేది చర్చగా మారింది.

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Day 31 Luxury Budget Task
ఆడియెన్స్ గట్టిగానే బుద్ధి చెప్పారా?

ఆడియెన్స్ గట్టిగానే బుద్ధి చెప్పారా?

ఒకవేళ భానుశ్రీ ఎలిమినేషన్ కరెక్టయితే కౌశల్‌పై అసత్య ఆరోపణలు చేసిన ఆమెకు ఆడియెన్స్ గట్టిగానే బుద్ధి చెప్పినట్టు అవుతుంది. గత ఎపిసోడ్‌లో భానుశ్రీని ఎలిమినేషన్ నుంచి కాపాడిన కౌశల్‌పై ఇలాంటి చవకబారు ఆరోపణలు చేయడం ఆడియెన్స్ తప్పక ప్రభావం చూపి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

కిరిటీ దారిలోనే భానుశ్రీ

కిరిటీ దారిలోనే భానుశ్రీ

గతంలో కౌశల్‌పై కిరిటి ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం వల్లనే ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లాడనే సత్యం. అలాంటి విషయం నుంచి భానుశ్రీ గుణపాఠం నేర్చుకోకపోవడం ఆమె ఇంట్లో అస్థిత్వానికి ముప్పు తెచ్చినట్టు కనిపిస్తున్నది. ఇపుడు కిరిటీ దారినే భానుశ్రీ పట్టినట్టు అర్ధమవుతున్నది.

రెండు రోజులుగా నెగిటివ్ ఓట్లు

రెండు రోజులుగా నెగిటివ్ ఓట్లు

కౌశల్‌పై ఆరోపణలు చేసిన తర్వాత భానుశ్రీకి వ్యతిరేకంగా ఆడియెన్స్ ప్రతికూలంగా ఓటు వేసినట్టు సమాచారం. మంచి, చెడు టాస్క్ తర్వాత భానుశ్రీకి వ్యతిరేకంగా చాలా ఓట్లు వచ్చినట్టు తెలుస్తున్నది. గత వారం మాదిరిగా ఎలాంటి భావోద్వేగం సన్నివేశాలు లేకుండా భానుశ్రీని ఇంటి నుంచి బయటకు పంపినట్టు తెలిసింది.

బలమైన కంటెస్టెంట్‌గా కౌశల్

బలమైన కంటెస్టెంట్‌గా కౌశల్

బిగ్‌బాస్ షోలో కౌశల్ రోజు రోజుకు కౌశల్ బలమైన కంటెస్టెంట్‌గా మారుతున్నాడు. కౌశల్ ఆటతీరు ఇంటి సభ్యుల్లో గుబులు రేపుతున్నది. కౌశల్ చాలా పకడ్బందీగా గేమ్ ప్లాన్‌ను రూపొందించుకొన్నట్టు స్పష్టమవుతున్నది. ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజుల్లో బిగ్‌బాస్ ఇంట్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకొనే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X