Pawan Kalyan: హరిహర వీరమల్లు నుంచి షాకింగ్ లీక్.. పవన్‌తో ఆ ఫైట్ హైలెట్ అటై
ఇప్పుడు టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రానున్న పలు అవైటెడ్ చిత్రాల్లో టాలీవుడ్ పవర్ స్టార్ హీరో అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ నుంచి ఉన్న పలు సినిమాలు కూడా ఉన్నాయి. కాగా ఈ చిత్రాల్లో రెండు పాన్ ఇండియా లెవెల్ సినిమాలు ఉండగా ఈ సినిమాల్లో ఒకటి దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించిన సినిమా హరిహర వీరమల్లు అలాగే మరో దర్శకుడు సుజీత్ తో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఓజి కూడా ఒకటి.
మరి ఈ సినిమాల్లో హరిహర వీరమల్లు సినిమా మొదటి పాన్ ఇండియా సినిమా కాగా దీనిపై అప్పట్లో నెలకొన్న హైప్ అంతా ఇంతా కాదు. కాగా దీని తర్వాత వచ్చిన ఓజి సినిమా దీనిని ఓవర్ టేక్ చేసి షాకిచ్చింది. మరి ఈ రెండిట్లో కూడా దేనికదే సెపరేట్ జానర్ గా తెరకెక్కిస్తుండగా వాటికి తగ్గట్టుగానే ఇంట్రెస్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ లని కూడా మేకర్స్ డిజైన్ చేస్తున్నారు.

ఇలా హరిహర వీరమల్లు సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం సినీ వర్గాల్లో ఒక లీక్ వైరల్ గా మారింది. కొన్ని రోజులు కితమే ఈ సినిమా నుంచి పవన్ పాన్ ఇండియా భాషల్లో పాడిన సాంగ్ మాట వినాలి బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సాంగ్ తర్వాత పవన్ కళ్యాణ్ పై ఓ యానిమల్ ఫైట్ సీన్ ఉంటుంది అని కొన్ని ట్రస్టడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఆ మధ్య సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ లో చూస్తే ఒక పోస్టర్ లో తోడేలు లాంటి దానితో పోస్టర్ ఉంటుంది. కాగా ఆ యాక్షన్ సీన్ ఈ సాంగ్ తర్వాతే సినిమాలో వస్తుందట. కానీ ఇపుడు సోషల్ మీడియాలో అది తోడేలు కాదు నక్క అని పవన్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. దీనితో నక్క అని చెప్తూ ఓ హీరో ఫ్యాన్స్ ని ట్రిగ్గర్ చేస్తున్నారా లేక నిజంగానే సినిమాలో నక్కతో పవన్ పోరాటం చేస్తారా అనేది మాత్రం సినిమా థియేటర్స్ లో వచ్చే వరకు లేదా టీజర్ గాని ట్రైలర్ గాని వస్తే వాటిలో ఉండే విజువల్స్ తోనే ఒక క్లారిటీ వస్తుంది.

కానీ ప్రస్తుతం అయితే అది నక్కే అంటూ ఓ టాక్ మాత్రం ఇపుడు వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నుంచి మరో బ్యూటీ నుపుర్ సనన్ కూడా ఉన్నట్టు టాక్ ఉంది. అలాగే అనిమల్, రీసెంట్ గా డాకు మహారాజ్ విలన్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండగా పవన్ కళ్యాణ్ మొగల్ చక్రవర్తిని ఎదిరించే వీరుడుగా కనిపించనున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో ఈ మార్చి 28న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.


Click it and Unblock the Notifications











