»   »  'బాహుబలి' : లీక్ కాకుండా రాజమౌళి ముందు జాగ్రత్తలు ఇవే

'బాహుబలి' : లీక్ కాకుండా రాజమౌళి ముందు జాగ్రత్తలు ఇవే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి' . ఈ చిత్రం ఈ నెల పదవ తేదీన భారీ ఎత్తున విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ, సీన్స్ లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా సెన్సార్ ద్వారా బయిటకు వెళ్లకుండా ప్రికాషన్స్ తీసుకున్నట్లు చెప్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అందుతున్న సమాచారం ప్రకారం ..ఈ చిత్రం సెన్సార్ జరుగుతున్నప్పుడు...ఆయన కొంతమందిని ఈ చిత్రం లీక్ కాకుండా ఏర్పాటు చేసారు. అందులో భాగంగా...సెన్సార్ సభ్యులు కాకుండా వేరే వారు..సెన్సార్ హాల్ లో ప్రవేశించకుండా జాగ్రత్తలు పడ్డారని చెప్పుతున్నారు.

అలాగే ఆపరేటర్ ని సైతం స్క్రీనింగ్ ప్రారంభం కాకుండా ప్రొజక్షన్ రూం నుంచి బయిటకు వెళ్లిపోమని చెప్పినట్లు తెలుస్తోంది. అలా...ఆయన కథ బయిటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.

leakage :Rajamouli precautionary measures

జూలై 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో భారీ ఎత్తున బాహుబలి సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రభాస్, రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో రానా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా కనిపించనున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, సత్యరాజ్, సుధీప్, నాజర్, అడవి శేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ డాల్బీ అట్మాస్ పరిజ్ఞానంద్వారా 3D సౌండ్ అనుభూతికలుగుతుంది. రియాలిటీకి దగ్గరగా వున్న ఈ పరిజ్ఞానాన్ని ఇదివరకు విశ్వరూపం సినిమాకు ఉపయోగించారు. ఇటువంటి ప్రయోగం చేయడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం

‘బాహుబలి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యం కోసం ఇద్దరు అన్నాదమ్ముల మధ్య జరిగే పోరాటమే బాహుబలి' . ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులు. రానా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు.

English summary
Rajamouli has taken care much about the film not to leak images, dialogues, scenes or songs from the beginning but leakage is coming somewhere other.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu