అదరకొడుతున్న 'ఎవడు' లీకెడ్ డైలాగు

By Srikanya

హైదరాబాద్ : ఎంతో కాలంగా రామ్‌చరణ్‌ అభిమానులు ఎదురుచూస్తున్న చిత్రం 'ఎవడు'. శ్రుతిహాసన్‌, అమీ జాక్సన్‌ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని దిల్ రాజు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో డైలాగ్స్ అంటూ నెట్ లో ప్రచారం పొందుతున్నాయి. అలా లీకెడ్ గా డైలాగు గా చెప్పబడుతూ అందరి నోట్లో నానుతున్న డైలాగు ఇదే...

"అనుకోగానే వెళ్లి కలవడానికి ఆడు బోనులో సింహం కాదు, అడవిలో సింహం. ముందు వెతకాలి. వెతికేలోగా, మనం బ్రతకాలి ."

చిత్రం గురించి దిల్ రాజు ఏమన్నారంటే...మా బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ఎవడు. ఈ చిత్రానికి సంభందించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసాము. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటన, శ్రుతి హాసన్, అమి జాక్సన్ అందాలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ,దర్శకుడు వంశీ పైడిపల్లి సూపర్బ్ టేకింగ్, ఈ చిత్రానికి హైలెట్స్ కాగా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు కాజల్ అగర్వాల్ పాత్రలు హైలెట్ గా నిలుస్తాయి. ఈ చిత్రం మెగా అభిమానులకు పండుగ వాతావరణం కల్పించటమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యథిక థియోటర్స్ లో విడుదల అవుతుంది అన్నారు.

Leaked dialogue of ‘’ Yevadu’’
చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు. మగధీర తర్వాత ఆ రేంజి హిట్టయ్యే సినిమా 'ఎవడు' మాత్రమే. మగధీరకు ఏమాత్రం తీసి పోని సినిమా ఇది, మగధీర తర్వాత ఇంత తక్కువ సమయంలో ఎవడు లాంటి సినిమా చేసే అవకాశం రావడం చరణ్ అదృష్టమే. అభిమానులు ఏ రేంజిలో ఊహించుకున్నా ఆ రేంజిని అందుకునే సత్తా ఉన్న సినిమా ఎవడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

సహ నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్ మాట్లాడుతూ...'ఎవడు చిత్రం చాలా బాగుంటుంది. దేవిశ్రీ ఆడియో సూపర్ హిట్టయింది. రామ్ చరన్ నటన, బన్నీ అప్రియరెన్స్ అదిరిపోతుంది. కాజల్ చేసింది చిన్న పాత్రే అయినా గుర్తుండి పోతుంది. హీరోయిన్స్ శృతి హాసన్, అమీ జాక్సన్ చాలా అందంగా ఉన్నారు. రామ్ చరణ్ డాన్స్ అదిరిపోతాయి. ' అన్నారు.

జయసుధ, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, సాయి కుమార్, అజయ్, ఎల్బీ శ్రీరామ్, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ: వంశీ పైడిపల్లి, వక్కతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, కథ సహకారం: హరి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, యాక్షన్ : సెల్వం, ఆర్ట్: ఆనంద్ సాయి, సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X