»   » బాలకృష్ణ 'లెజండ్' ఆడియో విడుదల తేదీ

బాలకృష్ణ 'లెజండ్' ఆడియో విడుదల తేదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'లెజండ్' . శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియో ని మార్చి 7 న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ఫిక్స్ అయినట్లు సమాచారం. త్వరలోనే ఈ రెండు తేదీలలో ఓ దానిని ఫైనల్ చేసి అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అలాగే చిత్రం ఫస్ట్ టీజర్ ని కూడా అతి త్వరలో లాంచ్ చేస్తారు.

    అలాగే మార్చి 28న గానీ, లేదంటే ఏప్రిల్‌ 4న గానీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ప్రస్తుతం దుబాయ్‌లో 'లెజెండ్‌' చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ కీలకమైన యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ''బాలకృష్ణని ఓ కొత్త తరహాలో చూపిస్తున్నాం. ఆయన మూడు గెటప్పుల్లో కనిపిస్తారు. బాలకృష్ణ పలికే ప్రతి సంభాషణ.. అభిమానుల్ని అలరించేలా ఉంటుంది'' అని దర్శకుడు చెప్తున్నారు.

    బాలయ్యతో 'సింహా' లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకుడవ్వడం, 'దూకుడు' లాంటి హిట్ తర్వాత నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం... ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి.ఈ చిత్రంలో లో బాలయ్య పాత్రలో రెండు రకాల కోణాలుంటాయని, అత్యంత శక్తిమంతంగా ఆయన పాత్ర ఇందులో ఉంటుందని సమాచారం.

    రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్‌సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తారు.

    పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను. దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని బాలయ్య రాజకీయ భవిష్యత్‌కు ఉపకరించేలా రూపొందిస్తున్నాడట. బాలయ్య అభిమానులను, తెలుగు దేశం పార్టీలను అలరించేలా సినిమాలో డైలాగులు ఉంటాయని, కొన్ని సన్నివేశాలు కూడా బాలయ్య అభిమానుల్లో జోష్ నింపే విధంగా ఉంటాయని చెప్పుకుంటున్నారు.

    ఈ చిత్రంలో బాలకృష్ణ సరికొత్తగా కనిపిస్తారు. ఆయన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన బుల్లెట్ బైక్, సఫారీ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బాలకృష్ణ ఎంతగానో సహకరిస్తున్నారని చిత్ర నిర్మాతలు తెలిపారు. దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ...'ఈచిత్రంపై అభిమానులకు భారీ అంచనాలు ఉండటం సహజం. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గని విధంగా ఈచిత్రం రూపుదిద్దుకుంటోంది' అన్నారు.

    English summary
    
 Legend will have its audio launch either on 7th or 9th March. The makers have zeroed on these two days. The final date will be made known very soon. Also the first teaser of the film will be launched shortly.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more