"లెజెండ్'' : ఇండియాలో తొలిగించిన ఎన్టీఆర్ సీన్ (వీడియో)
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందిన "లెజెండ్'' చిత్రం శుక్రవారం విడుదలై మాస్ తో పాటు క్లాస్ ఫ్యామిలీ అడియెన్స్ ను కూడా ఆకట్టు కుంటూ ముందుకు దూసుకు పోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇండియన్ వెర్షన్ లో ఓ సీన్ డిలేట్(సెన్సా ర్) అయ్యిందని, అందులో ఎన్టీఆర్ క్లిప్స్ వాడారని,వాటికి విపరీతమైన రెస్పాన్స్ వస్తోందని సమాచారం. ఆ సీన్ కు సంభందించిన ఈ వీడియో సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ప్రచారమవుతోంది. మీరూ ఆ వీడియో చూడండి...
ఇక ప్రీమియర్‌షో ప్రథమ, ద్వితీయ టికెట్లను ప్రవాసాంధ్రులు సతీష్, సుధాకర్‌లు చెరి 1116 డాలర్లకు కైవసం చేసుకున్నారు. దర్శకుడు బోయపాటి సినిమా విజయవంతం కావడానికి కృషిచేస్తున్న ప్రవాసాంధ్రులకు ధన్యవాదాలు తెలిపారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/B9kUEjTVDKg?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>
ఇక బాలకృష్ణ నటన, ఫైట్స్, సెంటిమెంట్ సీన్స్,సంభాషణలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. బాలకృష్ణ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ డే రికార్డింగ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించిన చిత్రం "లెజెండ్'' బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళ సాధించిన చిత్రంగానే కాకుండా నందమూరి వంశంలో 50 కోట్ల క్లబ్ లో చేరబోయే తొలి చిత్రంగా లెజెండ్ నిలవనుందని ట్రేడ్ ప్రతినిధులు చెపుతున్నట్టు నిర్మాతలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
వారాహి చలన చిత్రం, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ సంస్థలకు "లెజెండ్'' చిత్రం మరో భారీ హిట్ ను అందించింది. అలాగే దర్శకుడు బోయపాటి శ్రీనుపై పరిశ్రమ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం ఆంధ్ర-తెలంగాణా ప్రాంతాల్లో నే కాకుండా ఓవర్ సీస్ లోనూ "లెజెండ్'' చిత్రం విజయఢంకా మ్రోగిస్తోందని వారు తెలిపారు


Click it and Unblock the Notifications











