బాలకృష్ణ 'లెజెండ్' వెనక రహస్య ఎజెండా

పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను. దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని బాలయ్య రాజకీయ భవిష్యత్‌కు ఉపకరించేలా రూపొందిస్తున్నాడట. బాలయ్య అభిమానులను, తెలుగు దేశం పార్టీలను అలరించేలా సినిమాలో డైలాగులు ఉంటాయని, కొన్ని సన్నివేశాలు కూడా బాలయ్య అభిమానుల్లో జోష్ నింపే విధంగా ఉంటాయని చెప్పుకుంటున్నారు.
'సింహా'వతారంలో బాలకృష్ణ ఎలా ఉంటారో ఇదివరకే చూపించారు బోయపాటి శ్రీను. చూడూ ఒక వైపే చూడూ... అంటూ బాలకృష్ణ గర్జించారు. అది అభిమానులకు భలే నచ్చింది. అందుకే ఆ చిత్రం బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఆ కలయికలో రెండో చిత్రం రూపొందుతోంది. అదే... 'లెజెండ్'. బాలకృష్ణ సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 14రీల్స్, వారాహి చలన చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో విషయానికి వస్తే... ప్రస్తుతం దుబాయ్‌లో చిత్రీకరణ సాగుతోంది. హీరో,హీరోయిన్స్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. కుటుంబ అనుబంధాలు, యాక్షన్ అంశాల మేళవింపుతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో బాలకృష్ణ రెండు రకాల పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఇందులో బాలకృష్ణ నటన అందరినీ అలరిస్తుందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.


Click it and Unblock the Notifications











