ప్రభాస్ ‘బాహుబలి' కి ఆ సమస్యా?
అయితే ఈ సినిమా బడ్జెట్ పరంగా కూడా ఎక్కువే కాబట్టి రెండు భాగాలుగా విడుదల చేస్తే (రక్త చరిత్ర తరహాలో) అనే ఆలోచన కూడా ఉందని చెప్పుకుంటున్నారు. ఎలా చేయాలనే నిర్ణయం తీసుకుని త్వరలో షూటింగ్ మొదలడతారని తెలుస్తోంది.
'బాహుబలి' చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకోనుంది. 'ఈగ' చిత్రాన్ని మూడు భాషల్లో విడుదల చేసి దాదాపు 70కోట్ల రూపాయల రెవెన్యూను పొందగలిగారు రాజమౌళి. దాంతో 'బాహుబలి' చిత్రానికి అంతకుమించి రెవెన్యూను సాధించగలననే ధీమాతో రాజమౌళి వున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్, రానా అన్నదమ్ముల్లుగా నటించబోతున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.
ఇక ఈ నెల 14 నుంచీ ఈ చిత్రం షూటింగ్ నగర శివార్లలో జరగనుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే భారీ సెట్స్ నిర్మించారు. అక్కడే ఎక్కువ భాగం షూట్ చేసారు. దాదాపు ముప్పావు భాగం అక్కడే బ్లూ మ్యాట్ లో తీస్తారని వినికిడి. విజువల్ ఎఫెక్ట్స్ పై ఈ చిత్రం ఎక్కువ ఆధారపడనుంది.


Click it and Unblock the Notifications












