twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దూకుడు' కి లెంగ్త్ ప్లాబ్లం కానుందా?

    By Srikanya
    |

    'దూకుడు' చిత్రం ఈ నెల 23న అంటే రేపు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 50400 ఫీట్స్ తో ఉంది. రెండు గంటల యాభై నిముషాల రన్ టైమ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఏ చిత్రమూ ఇంత లెంగ్త్ తో రావటం లేదు. దాంతో ఈ చిత్రంకి లెంగ్త్ సమస్య వస్తుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే మహేష్ తన మెస్మరిజంతో దాటేస్తే అది పెద్ద సమస్య కాదని అంటున్నారు.ఇక ఈ మధ్య కాలంలో ఏ చిత్రం అయినా కేవలం రెండు గంటల పది నిముషాలు మాత్రమే ఉండేటట్లు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరో ప్రక్క దూకుడు కి చివరి అరగంట చాలా కీలకమైందని, అందుకే దాన్ని ఎడిట్ చేసి కుదించలేదని అంటున్నారు. నాన్ స్టాప్ గా అరగంట సేపు నవ్వించేలా కథనం రూపొందించారని అంటున్నారు. అలాగే సినిమాలో చాలా సీన్స్ లో మహేష్ తో బ్రహ్మానందం కనపించి నవ్వించనున్నారు. దూకుడు సినిమా పోకిరి లాగానో, ఒక్కడు లాగానో ఉండాలని డిజైన్ చెయ్యలేదు. మంచి ఎమోషన్, కామిడీ ని కలిపి బ్లెండ్ చేస్తూ చెప్పిన ఒక కొడుకు కథ అంటున్నారు రచయిత గోపీ మోహన్.

    ఆయన ఈ చిత్రం గురించి తన ట్విట్టర్ ఎక్కౌంట్ లో ఇలా ట్వీట్ చేసారు. అలాగే బేసిగ్గా నేను కృష్ణగారి అభిమానిని. కృష్ణగారు సాహసానికి మరో పేరని అంటుంటారు. ఈ సినిమాలో హీరో ఓ డైలాగ్ చెబుతాడు "మా నాన్నెప్పుడూ ఒకటంటుండేవాడు 'సాహసమే ఊపిరిగా బతికేవాడికి దారితో పనిలేదు దమ్ముతోనే పని' అని". ఈ డైలాగ్ మంచి సందర్భంలో వస్తుంది. దాన్ని అందరూ కృష్ణగారితో ఐడెంటిఫై చేసుకుంటారు అంటున్నారు రైటర్ గోపీమోహన్. అలాగే ఇందులోని డైలాగుల్లో 'పోకిరి' షేడ్స్, 'రెడీ' షేడ్స్ రెండూ కనిపిస్తాయి. అయితే ప్రేక్షకులకి ఇది కావాలని చేసినట్లు ఏమాత్రం అనిపించదు. కథే బలంగా ఎలివేట్ అవుతూ వెళ్తుంది. మీరు చూసినప్పుడు కూడా అదే ఫీలవుతారు అన్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు. సెన్సార్ U/A సర్టిఫికేట్ తో క్లియరెన్స్ ఇచ్చింది.

    English summary
    Dookudu which is reported to have made very lengthy with time duration of film run staying for nearly three hours. With entry of modern age directors, every one is trying to keep the duration in between 100 to 130 Minutes. In contrast Srinu Vytla is assuring full entertainment for three hours.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X