దేవరకొండ క్రేజ్.. గత సినిమాలతో సంబంధమే లేకుండా నైజాం హక్కులు.. మెంటల్ మాస్ అంతే!
పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారి రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆయన చివరగా 'వరల్డ్ ఫేమస్ లవర్'తో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఆ మూవీ డిసాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత పూరీ జగన్నాధ్ తో ఒక సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ సినిమా ప్రీ బిజినెస్ ఇప్పుడు షాక్ ఇస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

ట్రైలర్ లాంచ్
పూరీ, విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా 'లైగర్'. ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదలకు సిద్ధం అవుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్-పూరీ కనెక్ట్స్ బ్యానర్ మీద ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించారు. ఇక ఇప్పటికే లైగర్ ట్రైలర్తో తనలో ఫైర్‌ను చూపించిన విజయ్.. ఇప్పుడు ట్రైలర్ లాంచ్‌లో కూడా రచ్చ చేశాడు.

తొలి ప్యాన్ ఇండియా మూవీ
ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముతూ జీవనం గడిపే తల్లికి పుట్టిన ఒక కొడుకు . ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియ అయ్యాడనేదే ఈ సినిమా కథ. హీరోగా విజయ్ దేవరకొండకు దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌కు ఇది తొలి ప్యాన్ ఇండియా మూవీ కాగా ఈ సినిమాలో సునీల్ శెట్టి, మైక్ టైసన్ కీలక పాత్రలలో నటిస్తునట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సునీల్ శెట్టి డాన్ క్యారెక్టర్‌లో కనిపిస్తారని, విజయ్ డాన్ కొడుకని అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతూన్నాయి.

98 కోట్లకు
ఈ నేపధ్యంలో పెరిగిన క్రేజ్ కు అణుగుణంగా ఈ చిత్రం ఓటీటీ సహా శాటిలైట్ రైట్స్ అమ్ముడయినట్లు సమాచారం. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు దాదాపు రూ.98 కోట్లకు ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అన్ని భాషలకు కలిపి రెండూ హాట్ స్టార్ తీసుకుందని అంటున్నారు. ఇందులో 65 కోట్లు కేవలం ఓటీటీ నిమిత్తమే అంటున్నారు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ఈ రేటు పెట్టినట్లు తెలుస్తోంది.

నైజాంలో భారీ రేట్లు
ఇక ఈ సినిమాకు 160 కోట్లు బడ్జెట్ అయ్యిందని, ఇలా నాన్ థియేటరికల్ రైట్స్ నుంచే రూ.98 కోట్లు తెచ్చుకొందంటే మాగ్జిమం రికవరీ అయ్యినట్లే అని చెబుతున్నారు. అయితే ట్రైలర్ ఒక్కదానితోనే మూవీకి ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావడంతో నైజాంలో భారీ రేట్లు పెట్టినట్టు చెబుతున్నారు.

ఏకంగా 30 కోట్లు
నిజానికి విజయ్ దేవరకొండ హిట్ సినిమా గీత గోవిందం - 20.5 కోట్లు, నోటా - 3.5 కోట్లు, టాక్సీవాలా - 8 కోట్లు, డియర్ కామ్రేడ్- 6.7 కోట్లు, వరల్డ్ ఫెమస్ లవర్ - 3.6 కోట్లు క్లోజింగ్ షేర్స్ వచ్చాయి. అలాంటిది ఈ సినిమాకు ఇచ్చిన క్రేజ్ ప్రకారం లైగర్ నైజాం హక్కుల కోసం ఏకంగా 30 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాను ఎవరు కొని నైజాంలో విడుదల చేయనున్నారు అనేది చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











