అనుష్కతో ఆ దర్శకుడి ప్రేమాయణం, బలమైన సాక్ష్యాలు?

By Bojja Kumar

Lingusamy in love with Anushka
హైదరాబాద్: హాట్ బ్యూటీ అనుష్క అందానికి ఫిదా కాని వారు ఎవరుంటారు చెప్పండి! అరేబియన్ గుర్రంలా అదిరిపోయే ఒంపుసొంపులున్న ఆమెపై ఆకర్షణ కలగడం సహజమే. అనుష్కకు అందచందాలు మాత్రమే కాదు, మంచి మనసు కూడా ఉంది. తాజాగా అనుష్క గురించి ఓ ప్రేమ వార్త వినిపిస్తోంది. తమిళ దర్శకుడు లింగుస్వామి అనుష్క ప్రేమలో పడ్డట్లు ఫిల్మ్ నగర్ టాక్.

గత కొన్ని రోజుల క్రితం తమిళ సినిమా 'అంజాన్' ఆడియో విడుదల సందర్భంగా లింగు స్వామి అనుష్క గురించి మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాయి. ఆయన మాటలు విన్నపుడు లింగుస్వామి అనుష్క ప్రేమలో పడ్డాడనే అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా 'అంజాన్' తెలుగు వెర్షన్ 'సికిందర్' ఆడియో సందర్భంగా అనుష్క పక్కన ఒక షాట్లో నటించే అవకాశం ఇప్పించాలని కోరాడు. దీంతో అతనికి అనుష్కపై లవ్వు ఉందనే విషయం మరింత బలపడిందని అంటున్నారు.

మరి లింగు స్వామి ఈ మాటలు కేవలం ఫన్ కోసం అన్నారో...? నిజంగానే అనుష్కను ప్రేమిస్తున్నారో..? తెలియదు కానీ మొత్తానికి ఈ విషయం ఇపుడు తెలుగు, తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. మరి ఈ వార్తలపై అనుష్క ఎలా స్పందిస్తుందో చూడాలి.

లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న వస్తున్న 'సికిందర్' సినిమా విషయానికొస్తే...ఈ చిత్రంలో సూర్య, సమంత జంటగా నటిస్తున్నారు. తెలుగులో ఈచిత్రాన్ని లగడపాటి శ్రీధర్ విడుదల చేస్తున్నారు. 'సికిందర్' అద్భుతమైన చిత్రమని, కథ చాలా గొప్పగా ఉంటుందని లగడపాటి శిరీషా శ్రీధర్ అన్నారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X