ఎన్టీఆర్ 'దమ్ము'సాంగ్స్ లిస్ట్
ఎన్టీఆర్ తాజా చిత్రం'దమ్ము'ఆడియో ట్రాక్ లిస్ట్ బయిటకు వచ్చింది. ఈ చిత్రంలో ఐదు పాటలు,రెండు బిట్ సాంగ్స్ ఉన్నాయి. మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి ఇప్పటికి నాలుగు పాటలు కంపోజ్ చేసారు. ఇంకా మూడు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ పాటలు మార్చి చివరి వారంలో విడుదల కానున్నాయి. ఇప్పటి వరకూ పూర్తైన బిట్ సాంగ్స్ ఇవే..
1. దమ్ము దమ్ము (మొదటి పాట)
2. కుమ్మేద్దాం రా...
3. టైగర్..యంగ్ టైగర్
4. కమాన్ ..కమాన్
ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న దమ్ము పైనే ఎన్టీఆర్ పూర్తిగా దృష్టి పెడుతున్నారు. సింహాతో తన బాబాయ్ బాలకృష్ణను సూపర్ హిట్ బాటలోకి మళ్లీ ప్రయాణింప చేసిన బోయపాటి తనకీ ఆ రేంజి హిట్ ఇస్తాడని భావిస్తున్నాడు. అందుకునే ఆ సినిమా విడుదల అయ్యేదాకా నోరు విప్పకూడదని నిర్ణయించుకన్నాడు. తన సక్సెస్ మాత్రమే మాట్లాడాలని ఎన్టీఆర్ పూర్తి స్ధాయిలో పోరాడుతున్నాడు. ఇక దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తిక నటిస్తున్నారు. తొట్టింపూడి వేణు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బావగా కనిపించనున్నారు. భానుప్రియ ..ఎన్టీఆర్ కి తల్లిగా చేస్తోంది. ఇలా ఎక్కడా రాజీపడకుండా అద్బుతమైన తారాగణంతో ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











