సితార పాప హైరేంజులో మాస్టర్ ప్లాన్.. నెక్ట్స్ ఏం చేయబోతుందో తెలుసా?
సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు.. ఇటీవలే ఓ ఇంటర్నేషనల్ జ్యూవెలరీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికై అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ స్క్వేర్ బోర్డుపై మెరిసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ పాప కెరీర్ లో తీసుకుబోయే నెక్ట్స్ స్టెప్ గురించి సమాచారం అందింది. అది తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. వివరాళ్లోకి వెళితే....
సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాలపట్టి కూతురు సితార గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న వయసులోనే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటోంది. అతి చిన్న వయసులోనే భారీగా అభిమానులను సంపాదించుకోవడంతో పాటు స్టార్ స్టేటస్ ను కూడా అందుకుంది. ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో ఎక్కడ చూసినా సితార పేరే మార్మోగిపోతోంది. అతి చిన్న వయసులోనే ఈ రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్న స్టార్ కిడ్స్ లో సితార నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇకపోతే తాజాగా సితార నటించిన ఓ యాడ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఓ ప్రముఖ జ్యూవెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. దీంతో అమెరికాలోనే ప్రఖ్యాత న్యూయార్క్ స్క్వేర్ బోర్డ్ పై మెరిసింది. అలా చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన స్టార్ కిడ్ గా నిలిచింది. దీని కోసం సితార తీసుకున్న రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ జ్యూవెలరీ సంస్థ వారు సితారకు పెద్ద మొత్తమే ఇచ్చారని అన్నారు. దీంతో ఘట్టమనేని అభిమానులు తెగ సంతోషపడిపోయారు.
ఇక్కడి దాకా అంతా బాగుంది. మరి సితార పాప నెక్ట్స్ ఏం చేయబోతుంది అన్న ప్రశ్న అభిమానుల మదిలో మొదలైపోయింది. 'నటనలో శిక్షణ తీసుకుంటుందా?, 'సినిమాల్లోకి వస్తుందా?, 'అసలేం చేయబోతుంది?' అని తెగ చర్చించుకుంటున్నారంతా. అయితే ఈ నేపథ్యంలో తాజాగా అందిన సమాచారం ప్రకారం.. సితార మిస్ యూనివర్స్ లేదా మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధం కావాలని ఆశిస్తుందని తెలిసింది. ఆమె తల్లి నటి నమ్రతా సలహా మేరకు సితార ఈ పోటీలకు సిద్ధం అవ్వాలని నిర్ణయించుకుందట.

ఇకపోతే సితార ఇప్పటికే డ్యాన్స్ క్లాస్ ల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమె మల్టీ టాలెంటెడ్. బాగా మాట్లాడగలదు. ఇట్టే తన మాటలతో అందరినీ ఆక్టటుకోగలదు. ఆ మధ్యలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమాలోనూ 'పెన్ని' సాంగ్ లో తండ్రితో కలిసి చిందులేసింది. చూడాలి మరి త్వరలోనే సినిమాల్లోకి వస్తుందో లేదా కాస్త పెద్దయ్యాక ఎంట్రీ ఇస్తుందో...


Click it and Unblock the Notifications











