ఆదిపురుష్ కి లేటెస్ట్ షాక్.. అంతా సెట్ అనుకుంటున్న టైంలోఇలా!

భారతదేశ సినిమా పరిశ్రమలో ప్రభాస్ ఇప్పుడు బిజీయెస్ట్ స్టార్ట్ అయిపోయారు. ఆయన ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ మరికొన్ని సినిమాలు అనౌన్స్ చేశారు. ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత ఆ సినిమాలు కూడా ఆయన మొదలు పెట్టనున్నారు. అయితే ఒక సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ అలాగే ఆ సినిమా యూనిట్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

పాన్ ఇండియా లెవల్

పాన్ ఇండియా లెవల్

బాహుబలి తర్వాత ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.. ఆయన చేస్తున్న అన్ని సినిమాలను దాదాపు అన్ని భాషల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కారణంగా ఆయన చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. చివరిగా ఆయన చేసిన సాహో సినిమా మాత్రం ప్రభాస్ కు కలిసి రాలేదు. భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సినిమా కలెక్షన్ల పరంగా బాగానే ఆడినా టాక్ మాత్రం తెచ్చుకోలేక పోయింది.

సాహో ఎఫెక్ట్ తో

సాహో ఎఫెక్ట్ తో

ఇక సాహో సినిమా కి వచ్చిన రిజల్ట్ చూసిన ప్రభాస్ తర్వాత చేస్తున్న రాధేశ్యామ్ సినిమా మీద ఎక్స్ ట్రా కేర్ తీసుకుంటున్నారు. అందుకే చాలా రోజుల క్రితమే పూర్తి కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేర్పులు చేశారని అందుకే సినిమా లేట్ అవుతుంది అని ప్రచారంలో ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. చివరిగా ఈ సినిమా షూట్ జరుగుతున్నప్పుడు కరోనా కలకలం రేగడంతో షూట్ ఆపేశారు.

మూడు సినిమాలు లైన్ లో

మూడు సినిమాలు లైన్ లో


నిజానికి ప్రభాస్ మూడు సినిమాలు అనౌన్స్ చేశారు. ఒకటి నాగ్ అశ్విన్ సినిమా కాగా రెండోది ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమా. ఇక ఈ రెండూ కాకుండా ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమా. నిజానికి 'ఆదిపురుష్' షూటింగ్ హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. కరోనా కారణంగా ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్ లో ఆదిపురుష్

హైదరాబాద్ లో ఆదిపురుష్


కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ముంబైలో భారీ సెట్ వేశారు. ఓ షెడ్యూల్ కూడా జరిగింది. అయితే మరో షెడ్యూల్ ఆరంభించాలనుకున్న సమయంలో ముంబైలో కరోనా సెకండ్ వేవ్ ఆంక్షలు అడ్డు వచ్చాయి. షూటింగ్ ఆపాల్సి వచ్చింది. ముంబైలో పరిస్థితులు బాలేదు కాబట్టి, హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టాలని యూనిట్ భావిస్తోందని ప్లాన్ ప్రకారం అన్నీ అమలు జరిగితే వచ్చే వారంలో హైదరాబాద్ లో 'ఆదిపురుష్' కొత్త షెడ్యూల్ ఆరంభం అవుతుందని అన్నారు.

Recommended Video

Prabhas ఫేవరెట్ డైరెక్టర్ ఆయనే.. ఆ సినిమాలు 20 సార్లు చూసాడట!! || Filmibeat Telugu
లాక్ డౌన్ ఎఫెక్ట్

లాక్ డౌన్ ఎఫెక్ట్

అయితే ఈ షెడ్యూల్ లో పాల్గొనటానికి ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్ లు సైతం అంగీకరించారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అంత సిద్దం అయ్యాక తెలంగాణ ప్రభుత్వం యూనిట్ కి షాక్ ఇచ్చింది. తెలంగాణలో సైతం లాక్ డౌన్ విధించింది. పది రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో ఇక్కడ కూడా షూట్ జరిపే పరిస్థితి లేదు. నిజానికి ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ. షూటింగ్ లో మెజారిటీ భాగం ఇండోర్ లోనే ఉంటుంది. అందుకే పక్కాగా జాగ్రత్త తీసుకుంటే ఇంతటి ఇబ్బందికరమైన పరిస్థితిలోనూ షూటింగ్ చేయడం సమస్య కాదని యూనిట్ భావించింది. మరి చూడాలి ఏమవుతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X