Lokesh Kangaraj Remuneration : కూలీకి లోకేష్‌కు ఎన్ని కోట్ల పారితోషికమో తెలుసా? 3 ఏళ్లు కష్టపడితే..
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన రాబోయే చిత్రంతో మరింత సెన్సేషన్ గా మారబోతున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం భారీ అంచనాలు నెలకున్నాయి. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతుండగా ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను షురూ చేశారు. ఇక లోకేష్ కనగరాజ్ కూలి ప్రమోషన్స్ లో భాగంగా మొదటి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన రెమ్యునరేషన్ పై ఇలా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే..
కూలికి భారీ బడ్జెట్..
రజనీకాంత్ కు ఉన్న మార్కెట్ కారణంగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వ నైపుణ్యానికి ఉన్న డిమాండ్ కారణంగా కూలి చిత్రానికి భారీగానే ఖర్చు చేశారు. ఈ చిత్రంలో టాప్ హీరోయిన్లు శృతి హాసన్, పూజా హెగ్దే నటించడం, టాప్ స్టార్స్ అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శోబిన్ షహిత్ వంటి వారు కీలక పాత్రల్లో నటించడం విశేషం. మరోవైపు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అలాగే టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేశారు. దీంతో సినిమాకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. సన్ పిక్చర్స్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి నిర్మాత కళానిధి మారన్ రూ.350 కోట్లు ఖర్చు చేశారని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

లోకేష్ కనగరాజ్ రెమ్యునరేషన్..
ఇండియాలో ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో లోకేష్ కనగరాజ్ పేరు చేరిపోయింది. ఖైదీ చిత్రంతో ఆయన క్రియేట్ చేసిన సెన్సేషన్ తో లోకేష్ కనగరాజ్ చిత్రాలకు భారీ డిమాండ్ పెరిగింది. మరోవైపు నిర్మాణ సంస్థలు, స్టార్ హీరోలు ఆయనతో పని చేయడానికి ముందుకు రావడం, ఆడియెన్స్ లోనూ ఆయన చిత్రాలకు క్రేజ్ ఉండటం, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ సెన్సేషన్ గా మారడం వంటి అంశాలతో ఆయన టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి ఎక్కారు. ఈ కారణంగా లోకేష్ కగనరాజ్ భారీ రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. ఇక కూలికి మాత్రం రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకొంటున్నారని కోలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి.
రజనీకాంత్ రెమ్యునరేషన్..
సూపర్ స్టార్ రజనీకాంత్ చివరిగా జైలర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే తొలుత ఈ చిత్రానికి గాను రజనీకాంత్ రూ.100 కోట్లు మాత్రమే తీసుకున్నారు. సినిమా హిట్ అవ్వడంతో ఆ తర్వాత రూ.110 కోట్లు అందుకున్నారు. ఇలా మొత్తంగా రూ.210 కోట్లు పారితోషికం తీసుకున్నారు. ఇక కూలి చిత్రానికి మాత్రం రూ.150 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది.
కూలి విడుదల తేదీ..
రజనీకాంత్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, పూజా హెగ్దే వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రం కోసం అభిమానులు, నార్మల్ ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కూలి చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇండియాలో ఐదు ప్రధాన భాషలతో పాటు ఓవర్సీస్ లోనూ గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమయ్యారు.


Click it and Unblock the Notifications











