పవన్ కళ్యాణ్ ను అందలమెక్కిస్తున్న లండన్ బ్యూటి!?
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో సినిమా అనగానే ముందుగా సంతోషపడేది ఎవరు అంటే అతనితో కలిసి నటించే హీరోయిన్ అంటారు..సినీ విశ్టేషకులు..ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చిత్రాలు ఒక్కసారి పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ ఏ హీరోయిన్తో శృతిమించి ప్రవర్తించలేదు..కొన్ని చిత్రాలో అయితే హీరోయిన్ ను టచ్ కూడా చేయలేదు. అలాగే అతని చిత్రాలలో హీరోయిన్ అతిగా అందాల ప్రదర్శన కూడా చేయనవసరం లేదు..
ప్రస్తుతం పవన్ సరసన 'కొమరం పులి" చిత్రంలో పోలిస్ ఆఫిసర్ గా నటిస్తున్న లండన్ బ్యూటి నిఖిషా పటేల్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, నేనూ టాలీవుడ్ లోకి ఎంటర్ అవ్వడం అందులోనూ పవన్ కళ్యాణ్ గారితో నటించడం నా అదష్టంగా భావిస్తున్నాను. హి ఇజ్ ఏ రియల్ మ్యాన్..అతనితో కలిసి నటించడం..ఎంతో సంతోషంగా ఉంది..ఇప్పటి వరకు నాకు ఉన్న స్నేహితుల్లో ఇప్పటి వరకు అటువంటి అతన్ని చూడలేదు.
ఈ చిత్రం షూటింగ్ లో నేను ఎదుర్కొన్న కొన్ని ప్రాబ్లమ్స్ ను పవన్ ఇచ్చిన దైర్యంతో అన్నీ మర్చిపోగలిగాను..మళ్లీ అవకాశం ఉంటే అతనితో కలిసి నటించడానికి రెడీ గా ఉంటానంటుంది..(గతంలో జల్సా డైరక్టర్ త్రివిక్రమ్ కూడా ఇవే మాటలు చెప్పడం విశేషం..)
ప్రస్తుతం పవన్ 'పులి" చిత్రం మూడు పాటలు మినహా పూర్తియినట్లు గా సమాచారం. ఆ మూడు పాటలతో పాటుగా డబ్బింగ్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి అన్ని కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం మే 14న విడుదలకు సిద్దమౌతోందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











