పవన్ విషయంలో వర్మ రిక్వెస్ట్ ఫలించింది(ఫోటో ఫీచర్)
హైదరాబాద్ :వర్మ ప్రార్ధనను, రిక్వెస్ట్ ని గణేషుడు ఆలకించాడా అంటే అవుననే అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ జోశ్యం చెప్పినట్లుగా చేసిన ట్వీట్స్ ఇప్పుడు నిజం అయ్యి అంతటా చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఆయన పార్టీలో రావాలని ట్విట్టర్లో తెగ ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అదే ఇప్పుడు నిజం అయ్యింది. ఆయన గతంలో ఇదే విషయంపై వినాయిక చవితి రోజున ట్వీట్ చేసారు. అదేమిటంటే..
వర్మ ట్వీట్ 'సాధారణంగా నేను దేవుడిని పూజించను. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ప్రార్థించక తప్పడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాలి. అప్పుడే అన్ని సమస్యలు తీరుతాయి. నా కోరికను తీర్చు గణేషా' అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు.
దాంతో వర్మ కోరికను పవన్ రూపంలో గణేషుడు తీర్చాడంటున్నారు. ఎప్పుడూ సందర్భాన్ని బట్టి సంచలన వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మ తాజాగా రాజకీయాల్లోకి రానున్న పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఏ సంఘటన జరిగినా దానికి తగ్గట్టుగా వ్యాఖ్యానాలు చేసి సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ. గతంలో పవన్ కళ్యాణ్ ను బాలం థాకరేతో పోల్చి ఓబాల్ జనంలోకి వదిలిన రామ్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి పవన్ కళ్యాణ్ ఎంజీఆర్, చిరంజీవుల కంటే డేర్ ఉన్న డైనమిక్ లీడర్ గా అభివర్ణిస్తున్నాడు.
ఇంకా వర్మ ఏమన్నారు పవన్ గురించి...స్లైడ్ షోలో...

ఎంజీఆర్ కంటే...
వర్మ ట్వీట్ చేస్తూ... పనవ్ కళ్యాణ్ కొత్త పార్టీని ప్రారంభిస్తాడని నిజంగా నమ్ముతున్నాను. ఎంజీఆర్ నుంచి చిరంజీవి వరకు లీడర్ లుగా మారిన అందరు యాక్టర్ల కంటే డైనమిక్ లీడర్ పవన్ కళ్యాణ్.

కమిట్ మెంట్ ఉంది...
ఇంటెన్సిటీ కమిట్ మెంట్ తో పాటు అత్యంత భారీ స్థాయిలో జనాన్ని ఆకర్షించగల చరిష్మా ఉన్న వ్యక్తి పవన్. ప్రస్తుత రాజకీయాల్లో ఆయన తన మార్కుని ఖచ్చితంగా చూపిస్తాడు అని పవన్ ని ఆకాశానికి ఎత్తుతూ తన ట్వట్టర్ లో ట్వీట్ చేశాడు.

పుట్టిన రోజున ఇలా...
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా....‘పవన్ కళ్యాణ్ ఎప్పుడు పుడితే నాకేంటి... అతను పార్టీ పెట్టిన రోజే అతనికి నిజమైన జన్మదినం..ఆ రోజే నేను శుభాకాంక్షలు తెలియచేస్తాను' అని వర్మ అన్నారు.

ఎదురుచూస్తున్నారు...
'ఇప్పటి వరకు తాను నా జీవితంలో ఎప్పుడు ఓటు వెయ్యలేదు.. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని ప్రారంభిస్తే ఓటు వేస్తాను అనే మాటకు కట్టుబడి ఉంటాను. పవన్ కళ్యాణ్ కు తన ఓటు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పవర్ స్టార్ కు ఓటు వేసేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు.

ప్రజారాజ్యం పార్టీ కోసం..
పవన్ కళ్యాణ్ లో ఆలోచనల్లో నిజాయితీ, కళ్లలో పట్టుదల. చరిష్మా, ఇంటెన్సిటిలను బాల్ థాకరేలో కూడా చూడలేదు. ప్రజారాజ్యం పార్టీకి పవన్ కళ్యాణ్ సారథ్యం వహించి ఉంటే అఖండ మెజారిటీని సాధించి ఉండేదని తన ప్రగాఢ విశ్వాసం'

సినిమా కోసం కాదు...
తాను పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి చేసిన వ్యాఖ్యలు కాదని.. తాను పవన్ ను కలిసి ఐదు సంవత్సరాలైందన్నాడు. ఓ డైరెక్టర్ గా కాకుండా ఓ ఆంధ్ర ప్రదేశ్ పౌరుడిగా స్పందించానని వర్మ తెలిపాడు. అంతేకాక చిరంజీవికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కాదని.. పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా చేసినవేనని వివరణ ఇచ్చాడు.

పవన్ పాద యాత్ర
షర్మిల పాద యాత్ర చాలా మంది ఫాలోయర్స్ ని మేల్కొపినట్లే...పవన్ పాద యాత్ర చేస్తే...హిస్టరీ క్రియేట్ అవుతుందని అన్నారు. ఆయన చేసే పాదపాత్ర చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు వర్మ.

సునామీ స్టార్...
చిరంజీవిగారు 40 ఏళ్ళ తర్వాత ఇంకా పర్వతం మొదలు దగ్గరే ఉంటే... పవన్ కళ్యాణ్..హిమాలయాలను చేరుకున్నారు. *పవర్ స్టార్ కి పోలిస్తే మెగాస్టార్ వంటి పేర్లు చాలా చిన్నవి అతను.. సునామి స్టార్ గా మార్చుకోవాలి

అత్తారింటికి దారేది...
‘ నా మొత్తం కెరీర్లో నేను ఏ సినిమా కలెక్షన్స్ కి షాక్ అవ్వని రీతిలో అత్తారింటికి దారేది సినిమా కలెక్షన్స్ చూసి షాక్ అయ్యానని తరన్ ఆదర్శ్ నాతో అన్నాడు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో మొదటిసారి హాలీవుడ్ ఫిల్మ్ కంపెనీలు తెలుగు సినిమా సినిమా అయిన అత్తారింటికి దారేది కలెక్షన్స్ ని ట్రాక్ చేస్తున్నాయని'

ఇడియట్ అనుకుంటారు..
ఈ రేంజి సక్సెస్ అంతా పవన్ కళ్యాణ్ ది కాదు...అతన్ని ప్రేమించే వ్యక్తులది * ఇదంతా చూసాక కూడా ఆయన ఇష్టపడే జనాల కోసం కళ్యాణ్ సొంత పార్టీ పెట్టకపోతే ఆయన్ని పెద్ద ఇడియట్ అనుకుంటారు

చిరు కన్నా పెద్ద స్టార్
పవన్ కళ్యాణ్ ..కనుక చిరంజీవి కు సోదరుడు కాకపోయి ఉంటే కనుక తప్పకుండా చిరంజీవి కన్నా పెద్ద స్టార్ అయ్యేవాడని అన్నారు. పవన్ ఎక్సప్రెషన్స్ అద్బుతంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్స్ పవన్ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. అయితే ఈ విషయమై పవన్ మాత్రం ఏమీ స్పందించలేదు. స్పందరనే అనుకుంటున్నారు.

మహాత్ముడుతో..
పవన్ కళ్యాణ్ గనుక పాద యాత్ర చేస్తే కనుక...అది మహాత్మా గాంధీ పాదయాత్రను గుర్తు చేస్తుంది అని నేను చెప్పగలను అంటూ పవన్ ని ఆయన పొగడ్తల్లో ముంచెత్తారు. అప్పట్లో మహాత్మా గాంధీ పాద యాత్ర కి జనం చాలా మంది వచ్చారు. అదే విధంగా పవన్ కీ ఫాలోవర్స్ ఉన్నారని వర్మ అన్నారు.


Click it and Unblock the Notifications











