పుష్ప 2లో బెస్ట్ యాక్షన్ సీన్ ఇదే.. ఎవరూ చేయని రిస్క్ చేసిన అల్లు అర్జున్

గతంలో ఏమో కానీ ఈ మధ్య కాలంలో వచ్చే టాలీవుడ్ చిత్రాలు అన్నీ దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించే విధంగానే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు నటించే మూవీలు అన్నీ పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతున్నాయి. అలా కొన్నేళ్ల క్రితం వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన మూవీనే 'పుష్ప ది రైజ్'. ఈ చిత్రం నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ అయిన విషయం తెలిసిందే.

'పుష్ప ది రైజ్' సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్' మూవీని తీస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎంతో జోష్‌తో జరుపుతోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేసి ఆగస్టు 15న విడుదల చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు.

Lorry Chasing Scene Highlight In Allu Arjun Pushpa The Rule

సంచలనం సృష్టించిన సినిమాకు కొనసాగింపుగా వస్తోన్న 'పుష్ప ది రూల్'పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని తీస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ వీడియోకు, మొదటి పాటకు అదిరిపోయే స్పందన కూడా వచ్చింది. దీనికితోడు ఈ చిత్రం నుంచి తరచూ ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది.

పుష్ప రాజ్ సాధారణ కూలీ నుంచి ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో డాన్‌గా ఎలా మారాడు అనే పాయింట్‌తో 'పుష్ప ద రూల్' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఫస్ట్ పార్ట్ కంటే అన్నీ హై రేంజ్‌లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఓ సందర్భంలో వచ్చే సీక్వెన్స్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంటుందని తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది.

Lorry Chasing Scene Highlight In Allu Arjun Pushpa The Rule

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'పుష్ప ది రూల్' మూవీలో ఓ లారీ చేజింగ్ సీన్‌ను హాలీవుడ్ రేంజ్‌లో డిజైన్ చేసినట్లు తెలిసింది. అంతేకాదు, ఇందులో అల్లు అర్జున్ రిస్కీ షాట్స్ కూడా చేశాడని అంటున్నారు. ముఖ్యంగా ఇందులో అతడు ఓ లారీని నిజంగానే డ్రైవింగ్ చేశాడని అంటున్నారు. దీంతో ఈ యాక్షన్ చేజింగ్ సీన్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్‌ - సుకుమార్ కాంబోలో వస్తున్న 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X