పాపం జూ ఎన్టీఆర్ మీద జోకులేసుకుంటున్నారు...
హీరోలందరూ ఏదో ఒక బ్రాండ్ కి ప్రచారం చేస్తూ ఉండడంతో తను కూడా అందులోకి దిగాలని డిసైడ్ అయిన జూ ఎన్టీఆర్ ముందుగా జండూబామ్ తో ఒప్పందం చేసుకున్నాడు. అయితే ఎన్టీఆర్ ఎంచుకున్న ఈ ప్రాడక్ట్ పై అప్పుడే జోకులు పుట్టుకొచ్చేశాయి. ఒకవేళ ఎన్టీఆర్ సినిమా బాగలేకపోతే ప్రేక్షకులకు జండుబామ్ ఇచ్చి నెత్తిన మర్థనా చేసుకొమ్మని చెప్పొచ్చని, సినిమాల్లో ఎన్టీఆర్ రెచ్చిపోయి తొడ గొట్టుకుని, అది వాచిపోతే జండూబామ్ తో మర్థనా చేసుకున్నట్టు చూపించవచ్చని, ఎన్టీఆర్ నటించిన సినిమా టికెట్ తో జండూబామ్ బాటిల్ ఫ్రీగా ఇవ్వవచ్చునని, మా తాత ఇదే వాడారు, నేను కూడా ఇదే వాడుతున్నాను అంటూ జండూబామ్ కి ఎన్టీఆర్ ప్రచారం చేయవచ్చునని రకరకాల జోకులు పేలుతున్నాయి. 'ఖలేజా" సినిమాకి మహేష్ ఇలాంటి జోకులే ఎదుర్కొన్నాడు. అమృ తాంజన్ తో ఒప్పందం చేసుకుని దాని సేల్స్ పెంచడానికి ఖలేజా తీశాడని చెప్పుకుని నవ్వుకున్నారు.


Click it and Unblock the Notifications











