లవర్స్ డే రోజు సిద్ధార్థ లవ్ ఫెయిల్యూర్
సిద్దార్ధ, ఆమలా పాల్ జంటగా రూపొందుతున్న చిత్రం 'లవ్ ఫెయిల్యూర్'. ఎస్.వి.సి పతాకంపై బాలాజీ మోహన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. కథ నచ్చడంతో సిద్ధార్థ కూడా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరిగా మారాడు. చక్కని వైవిధ్యంతో కూడిన రొమాంటిక్ లవ్‌స్టోరీ ఇదని, ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలు చిత్రంలో వుంటాయని, థమన్ అందించిన పాటలు హైలెట్‌గా నిలుస్తాయని, చిత్రం పాటలు తప్పక విజయవంతమవుతాయ యూనిట్ సభ్యులు అంటున్నారు.
ఈ చిత్రాన్ని లవర్స్ డేను పురస్కరించుకుని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ వెర్షన్లలో ఒకే సారి ఈ చిత్రం విడుదల కానుంది. యువతను, కాలేజీ స్టూడెంట్స్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే లవర్స్ కు పండగ రోజైన వాలంటైన్స్ డే రోజు....లవ్ ఫెయిల్యూర్ సినిమాను విడుదల చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. సినిమాలో ఏముంటుంది? ప్రేమ దోమ అంటూ కెరీర్ ను పాడు చేసుకుంటున్న యువతకు సందేశాత్మకంగా ఉంటుందా? లేక ప్రేమ పక్షుల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉంటుందా? అని చర్చించుకుంటున్నారు. సంగీతం: థమన్. నిర్మాత: రాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాలాజీ మోహన్.


Click it and Unblock the Notifications











