»   » అనుపమ పరమేశ్వర్ ఆ తెలుగు హీరో తో నైట్ పార్టీలు ?నిజమా

అనుపమ పరమేశ్వర్ ఆ తెలుగు హీరో తో నైట్ పార్టీలు ?నిజమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :శర్వానంద్- అనుపమ పరమేశ్వరన్ జంటగా టాలీవుడ్‌లో సంక్రాంతికి రిలీజైన సినిమా శతమానం భవతి. పెద్ద మూవీలతో పోటీపడిన ఈ చిత్రం ఊహించని విధంగా కలెక్షన్స్ సునామి సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకవిధంగా చెప్పాలంటే హీరో కెరీర్‌లో ఇదో రికార్డ్. గతంలో శర్వానంద్ హిట్స్ కు వచ్చిన కలెక్షన్స్ ను కూడా ఈ సినిమా అధిగమించింది. ఇక శాటిలైట్ రైట్స్ 3.5 కోట్ల వెళ్లినట్టు సమాచారం. ఓవర్సీస్ కూడా దుమ్ము రేపింది.

ఇదంతా రోజూ విన్న వార్తలే కదా..అందులో కొత్తేముంది అంటారా.. ఈ చిత్రం సూపర్ హిట్ ఉత్సాహంలో ఉన్న హీరో,హీరోయిన్స్ ఇప్పుడు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ మీడియాలో గుప్పు మనటమే తాజా సెన్సేషన్.

Love is in the air between Anupama & Sharwanand ?

'అ..ఆ' చిత్రం రిలీజైన నాటి నుంచే...తెలుగు చిత్ర పరిశ్రమలో అనుపమ పరమేశ్వర్ పేరు మారుమ్రోగుతోంది. శతమానం భవతి చిత్రం హిట్‌తో ఆమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. కుర్ర హీరోలు ఆమె కాల్షీట్ల కోసం ఆసక్తి చూపిస్తున్నారట. దీనితో దర్శకనిర్మాతలు ఆమెను తమ చిత్రాల కథలకు హీరోయిన్ గా చెప్తున్నారు. ఈ నేపధ్యంలో అనుపమ హైదరాబాద్ సిటీ వదిలి వెళ్లడంలేదు.

అయితే ఆమె సిటీ విడిచిపెట్టకుండా ఇక్కడే అంటిపెట్టుకుని వుండటంతో తనకు బాగా పరిచయం అయిన హీరో శర్వానంద్ తో ఆమె గడుపుతోందని చెప్పుకుంటున్నారు. శతమానం భవతి హీరోతో అనుపమ రాత్రిపూట పార్టీలకు వెళుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినపడుతున్నాయి.

అయితే కేవలం సినిమా సక్సెస్ పార్టీలే అని కాకుండా అదేపనిగా ఆమె శర్వానంద్ తోనే అంటిపెట్టుకుని ఉందని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. కాకపోతే వాళ్లద్దిరి మధ్యా ఉన్నది ఫ్రెండ్లీ రిలేషన్ కావచ్చు కదా, ఓ సినిమా సక్సెస్ అయితే ఇలాంటి రూమర్స్ రావడం సహజమేనని ఆమె సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు.

English summary
The latest rumor in industry, is that the Premam beauty Anupama Parameswaran and Sharwanand of are in love.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu