ఓకే ఒక్క బ్లాక్ బస్టర్.. ఇక శ్రీలీలకు చెక్ పడినట్టే.. టాలీవుడ్‌లోకి మరో గ్లామర్ బ్యూటీ

తెలుగు చిత్రసీమలో ప్రతి ఏడాది కొత్త అందాలు వస్తూనే ఉంటాయి. కానీ వారిలో కొంతమందే సక్సెస్ అవుతుంటారు. మరి కొందరు అడపాదడపా చిత్రాలు చేస్తూ గ్లామర్ రోల్స్ తో నెట్టుకొస్తుంటారు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో జోరు కొనసాగిస్తున్న బ్యూటీల్లో శ్రీలీల మొదటి వరుసలో ఉంది. అయితే అంతా అనుకున్నట్లు జరిగితే.. ఇప్పుడీ ముద్దుగుమ్మకు మరో భామ గట్టి పోటినిచ్చే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఆమె ఎవరో తెలుసుకుందాం..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ అనగానే గుర్తొచ్చే భామ శ్రీలీల. చేసింది రెండు సినిమాలే అయినా.. చేతిలో మాత్రం వరుస సినిమాల అవకాశాలతో దూసుకుపోతోంది. యంగ్ హీరోల నుంచి స్టార్ కథానాయకుల వరకు అన్నీ చిత్రాల్లో ఈమెనే నటిస్తోంది. 'పెళ్లిసందడి'తో ఎంట్రీ ఇచ్చి .. 'ధమాకా' సినిమాతో 100 కోట్ల హీరోయిన్ గా మారిపోయింది. అప్పటినుంచి ఆమెకు అదృష్టం వెంటే నడుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో పది నుంచి పన్నెండు చిత్రాలకు వరకు ఉన్నాయి.

Love Today heroine Ivana is going to come with the movie Selfish to break Sreeleela

లవ్ టుడే బ్యూటీ: అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మకు ఓ పోటీ ఎదురైంది. ఆమె పేరే మృణాల్ ఠాకూర్. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో పాగా వేస్తోంది. విజయ్ దేవరకొండ, నాని కొత్త చిత్రాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంది. మరిన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. అయితే మృణాల్ విషయాన్ని పక్కనపెడితే.. త్వరలోనే ఓ కొత్త అందం టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే ఆమె డబ్బింగ్ సినిమాతో యూత్ గుండెల్లో గూడు కట్టుకుని కూర్చుంది. ఆమె డైరెక్ట్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆమె మరెవరో కాదు ఇవానా. 'లవ్ టుడే' బ్యూటీ.

Love Today heroine Ivana is going to come with the movie Selfish to break Sreeleela

దిల్ రాజు సినిమాతో: గత ఏడాది 'లవ్ టుడే' డబ్బింగ్ సినిమాతో పరిచయమైన ఇవానా.. తమిళంలో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో ఆమెకు అక్కడ వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక తెలుగులోనూ ఆమె ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న 'సెల్ఫిష్' లో నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాలో దిల్ రాజు ఫ్యామిలీ హీరో, అన్న కొడుకు ఆశిష్ హీరోగా నటిస్తున్నారు. విశాల్ కాశి అనే కొత్త దర్శకుడు దీన్ని తెరకెక్కిస్తున్నారు.

Love Today heroine Ivana is going to come with the movie Selfish to break Sreeleela

రియల్ లొకేషన్స్ లో: ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ లొకేషన్స్ లో చిత్రీకరిస్తున్నారు. ఆడియెన్స్ ను బాగా దగ్గర చేసేందుకు నేచురాలిటీగా సినిమాను తీస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ సగం వరకు పూర్తైనట్లు సమాచారం అందింది. త్వరలోనే ముగించి.. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ లో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా భారీ హిట్ అందుకుని తెలుగులో పాగా వేయాలని చూస్తోంది ఇవానా.

Love Today heroine Ivana is going to come with the movie Selfish to break Sreeleela

అరడజను సినిమాలు: ఇప్పటికే శ్రీలీల కూడా.. ఓ యంగ్ హీరో చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. కాబట్టి ఇక నేచురల్ యాక్టింగ్ తో పాటు మంచి గ్లామర్ ఉన్న ఇవానా కూడా.. సెల్ఫిష్ తో భారీ హిట్ కొడితే.. ఇక్కడ కూడా వరుస అవకాశాలను దక్కించుకుంది. ఒకేసారి ఓ అరడజను సినిమాలను చేతిలోకి తీసుకుంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అప్పుడు శ్రీలీలకు మరో పోటీ వచ్చినట్టవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X