RRR నుంచి షాకింగ్ అప్‌డేట్: రెమ్యూనరేషన్‌లో సరికొత్త రికార్డ్.. ఇండియాలోనే ఫస్ట్ టైం.!
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రం RRR. 'బాహుబలి' వంటి సూపర్ హిట్ సిరీస్ తర్వాత దర్శకధీరుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. దీనికితోడు ఈ మూవీ గురించి తరచూ ఏదో ఒక సంచలన వార్త హాట్ టాపిక్ అవుతోంది. దీంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతోంది. ఇక, తాజాగా RRR గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం.!
Recommended Video


RRR వెనుక అసలు కథ ఇదే
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రమే RRR. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే వీరితో పాటు పలువురు ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులో చెర్రీ.. అల్లూరిగా, తారక్.. కొమరం భీంగా కనిపించనున్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

మాట మీద నిలబడని రాజమౌళి
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను జూలై 30, 2020న విడుదల చేస్తామని రాజమౌళి గతంలో ప్రకటించారు. అయితే, ఇప్పుడా తేదీని జనవరి 8, 2021కి మార్చారు. దీంతో చిత్ర యూనిట్‌పై హీరోల ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు సంబంధించిన ఒక్క అప్‌డేట్ కూడా విడుదలవ్వకపోవడంతో వాళ్లంతా నిరాశగా ఉన్నారు.

సరికొత్త ప్లాన్.. అందుకే మార్చారు
ఈ సినిమాను ముందుగా ప్రకటించిన తేదీన కాకుండా మరికొన్ని రోజులు వాయిదా వేయడం వెనుక భారీ ప్లాన్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఎక్కువ బడ్జెట్‌తో తీస్తున్న చిత్రం కావడంతో.. కలెక్షన్ల దండయాత్ర చేయాలంటే మంచి సీజన్ కావాలి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి మించిన సీజన్ దొరకదు. అందుకే ఈ సినిమాను జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారని టాక్.

రెమ్యూనరేషన్‌లో సరికొత్త రికార్డ్
ఎన్నో హంగులతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ తాజాగా ఫిలింనగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఎమ్ ఎమ్ కీరవాణి.. రెమ్యూనరేషన్‌గా రూ. 16 కోట్లు తీసుకుంటున్నారట. దాదాపుగా రాజమౌళితో సమానంగా ఆయన చార్జ్ చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

అంత మొత్తం.. ఇండియాలోనే ఫస్ట్ టైం.!
RRR మూవీకి కీరవాణి తీసుకున్న మొత్తం.. ఇండియాలోనే టాప్ రెమ్యూనరేషన్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఏఆర్ రెహమాన్ మాత్రమే రూ. 6 కోట్లు తీసుకున్నారట. తెలుగులో దేవీ శ్రీ ప్రసాద్ రూ. కోటి చార్జ్ చేశారని సమాచారం. ఇప్పుడు 16 కోట్ల రూపాయలు తీసుకుని వీళ్లెవరికీ అందనంత దూరంలో నిలిచారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి.


Click it and Unblock the Notifications











