ఎమ్.ఎస్.రాజు 'రమ్' ఏమైంది?

ఇందులో త్రిష యాక్షన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రం కోసం చిత్రీకరించిన కారు రేస్ సన్నివేశంలో రిస్క్ తీసుకుని ఫైట్ చేసిందట త్రిష. దర్శక నిర్మాతలు డూపుతో చిత్రీకరిద్దామన్నా వద్దని వారించి మరీ ఈ ముద్దుగుమ్మ రిస్కీ ఫైట్ కోసం సాహసం చేసింది.
'రమ్' చిత్రం షూటింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ మస్కట్ లో చేసారని వినికిడి. విజయన్ స్టంట్ మాస్టర్ తమ చేత అదిరిపోయే క్రేజీ స్టంట్స్ చేయించారని,నీళ్లలో,మంటల్లో, గాలిలో ఈ ఫైట్స్ తీసారని నిఖిషా పటేల్ చెప్పటం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది.
నిర్మాతగా ఎంఎస్ రాజు ఆ మధ్య వరుస హిట్లు కొట్టి బాగా పాపులరైన సంగతి తెలిసిందే. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్నట్లు ఈ మధ్య ఈ నిర్మాత వరుస ప్లాపులు చుట్టుముట్టాయి. ఇప్పుడు ఆయన తన కుమారుడుతో చిత్రం చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











