twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎమ్‌.ఎస్‌.రాజు 'రమ్‌' ఏమైంది?

    By Srikanya
    |

    M.S Raju's Rum in financial crisis
    హైదరాబాద్ : ఎమ్‌.ఎస్‌.రాజు స్వీయ దర్శకత్వంలో'రంభ ఊర్వశి మేనక' ('రమ్‌' )అనే చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రిష, నికీషా పటేల్‌, ఇషా చావ్లా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం ఫైనాన్సియల్ క్రైసిస్ లో ఇరుక్కుని ఆగిపోయింది. ఈ చిత్రం మేజర్ షెడ్యూల్స్ రెండు జరిగి మూడో షెడ్యూల్ వద్ద ఆగిపోయింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2013లోనే విడుదల అవుతుందని అంతా భావించారు. అయితే అనుకోని విధంగా ఆర్దిక ఇబ్బందులు రావటంతో ఎమ్.ఎస్ రాజు చేతులెత్తేసారని చెప్పుకుంటున్నారు.

    ఇందులో త్రిష యాక్షన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రం కోసం చిత్రీకరించిన కారు రేస్ సన్నివేశంలో రిస్క్ తీసుకుని ఫైట్ చేసిందట త్రిష. దర్శక నిర్మాతలు డూపుతో చిత్రీకరిద్దామన్నా వద్దని వారించి మరీ ఈ ముద్దుగుమ్మ రిస్కీ ఫైట్ కోసం సాహసం చేసింది.

    'రమ్‌' చిత్రం షూటింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ మస్కట్ లో చేసారని వినికిడి. విజయన్ స్టంట్ మాస్టర్ తమ చేత అదిరిపోయే క్రేజీ స్టంట్స్ చేయించారని,నీళ్లలో,మంటల్లో, గాలిలో ఈ ఫైట్స్ తీసారని నిఖిషా పటేల్ చెప్పటం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది.

    నిర్మాతగా ఎంఎస్ రాజు ఆ మధ్య వరుస హిట్లు కొట్టి బాగా పాపులరైన సంగతి తెలిసిందే. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్నట్లు ఈ మధ్య ఈ నిర్మాత వరుస ప్లాపులు చుట్టుముట్టాయి. ఇప్పుడు ఆయన తన కుమారుడుతో చిత్రం చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    MS Raju directorial venture ‘Rambha Urvasi Menaka’(RUM) has completed two major schedules of shooting. There is one more schedule to complete to wrap up the shoot. But buzz is that the film was run in to financial problems and the shooting has been stalled. Trisha, Charme, Isha Chawla and Nikeesha Patel are playing the lead roles in this action entertainer. The film was earlier scheduled for release in 2013 itself but due to financial problems it was put on hold for next year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X