ప్రభాస్‌కు విలన్‌గా కొరియన్ స్టార్.. ఎవరు సెట్ చేశారో తెలిస్తే మెంటలెక్కిపోద్ది!

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో డిఫరెంట్ కాంబినేషన్లు కనిపిస్తున్నాయి. అలా ఇప్పటికే టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా కొందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. అందులో రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నాడు. ఇప్పటికే చాలా మంది స్టార్లతో సినిమాలు చేసిన అతడు.. ఇప్పుడు కొందరిని లైన్‌లో పెట్టాడు.

'బాహుబలి' తర్వాత భారీ చిత్రాలతో వస్తున్న ప్రభాస్.. ఇటీవలే 'కల్కి 2898 ఏడీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి భారీ స్పందన రావడంతో అత్యధిక వసూళ్లను సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే ప్రభాస్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. అలా ఇప్పుడు ఈ పాన్ ఇండియా హీరో 'స్పిరిట్' మూవీపై ఫోకస్ చేస్తున్నాడు.

Ma Dong-seok Villain Role In Prabhas Starrer Spirit Movie

రెబెల్ స్టార్ ప్రభాస్.. కొంత కాలంగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన 25వ సినిమాను కూడా ప్రకటించాడు. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ఈ సినిమాకు 'స్పిరిట్' అనే టైటిల్ పెట్టారు. దీన్ని పాన్ వరల్డ్ రేంజ్‌లో ఎనిమిది భాషల్లో రూపొందిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

పాన్ ఇండియా హీరో ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న 'స్పిరిట్' సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడి ఎన్నో రోజులే అవుతోన్నా.. వీళ్లిద్దరూ వేరే వేరే చిత్రాలతో బిజీగా ఉండడంతో ఇప్పటి వరకూ చిత్రీకరణ మాత్రం మొదలవలేదు. కానీ, ఈ సినిమాలో కాస్టింగ్ (నటీనటులు) గురించి మాత్రం ఎన్నో రకాల అంశాలు బయటకు వస్తున్నాయి.

Ma Dong-seok Villain Role In Prabhas Starrer Spirit Movie

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రాబోతున్న 'స్పిరిట్' మూవీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీతో తెరకెక్కనుంది. దీంతో ఇందులో పేరున్న నటీనటులను తీసుకోవాలని సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈ చిత్రంలో విలన్‌గా కొరియన్ స్టార్ డాన్ లీ (Ma Dong-seok)ని తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని టాక్.

ఇదిలా ఉండగా.. బడా స్టార్ల కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'స్పిరిట్' మూవీని ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు కూడా తెలిసింది. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారని అంటున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషన్ కుమార్ నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Read more about: prabhas spirit ma dong seok
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X