ఆ ఇద్దరిపై చిరంజీవి ఆగ్రహం?.. నిధుల దుర్వినియోగం ఎన్ని కోట్లంటే!
Recommended Video

పేద సినీ కళాకారులకు అండగా ఉండాల్సిన మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా)లో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు రావడం సినీవర్గాల్లో భారీ చర్చకు దారి తీసింది. మా సంఘం రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పర ఆరోపణలతో ఒకరిపై మరొకరు బురద జల్లుకోవడం వివాదం మరింత రాజేసుకొన్నది. ఈ వ్యవహారంలోకి చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్‌ను లాగడంతో వివాదం మరింత రచ్చ రచ్చగా మారింది. అయితే రెండు రోజులుగా బయటకు పెద్దగా కనిపించకపోయినా ఈ వివాదం లోలోపల రాజేసుకొంటున్నట్టు సమాచారం. వివారాల్లోకి వెళితే..

చిరంజీవిని లాగడంతో వివాదం
నిధుల కుంభకోణం జరుగలేదంటూ మా అధ్యక్షుడు శివాజీరాజా, శ్రీకాంత్, పరుచూరి వెంకటేశ్వరరావు మీడియా సమావేశాన్ని నిర్వహించి ప్రధాన కార్యదర్శి నరేష్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పలు ఆరోపణలు చేస్తూ.. ఈ విషయంపై చిరంజీవితో చర్చించామని పేర్కొన్నారు. దాంతో ఈ వర్గానికి చిరంజీవి మద్దతు ఉందనే ప్రచారం జరిగింది.

చిరంజీవి ఆగ్రహం
తన పేరును మీడియాలో సమావేశంలో వాడుకోవడంపై శివాజీరాజా, శ్రీకాంత్ తదితరులపై చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. అందుకే నరేష్ ఇచ్చిన కౌంటర్‌పై మారు మాట్లాడుకుండా ఉన్నారని తెలుస్తున్నది. ఎలాంటి మోసం, డబ్బు దుర్వినియోగం చేయలేదని, నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పిన శివాజీరాజా నోరు విప్పకపోవడంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.

రాజీ ప్రయత్నాలు షురూ
పరస్పర మీడియా సమావేశాలు, ఆరోపణలతో రోడ్డున పడిన మా వివాదాన్ని పరిష్కరించేందుకు సినీ పెద్దలు రంగంలోకి దిగినట్టు సమాచారం. రెండు వర్గాలకు నచ్చజెప్పి రాజీ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలుస్తున్నది. ఈ వివాదం మరింత ముందుకు వెళ్తే సినీ పరిశ్రమ ప్రతిష్ఠ మరింత దిగజారుతుందని రెండు వర్గాలను హెచ్చరించినట్టు సమాచారం.

రూ. 5 కోట్లకుపైనే
మా సంఘంలో నిధుల దుర్వినియోగం ఏ మేరకు జరిగిందనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నది. దాదాపు రూ.5 కోట్లకుపైనే అవకతవకలు జరిగాయనే మాట వినిపిస్తున్నది. మంచు మనోజ్ చెప్పినట్టు ఎవరూ తప్పు చేయకపోతే అకౌంట్ పుస్తకాలు బయటపెట్టాలనే డిమాండ్‌కు మద్దతు లభిస్తున్నది.

నరేష్‌కు పెరుగుతున్న మద్దతు
మా అధ్యక్షుడు శివాజీ రాజాపై ఆధారాలతో సహా ఆరోపణలు చేసిన సీనియర్ నటుడు నరేష్‌కు సినీ వర్గాల నుంచి భారీగా మద్దతు లభిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ వివాదంలో నరేష్ పైచేయి సాధించడంతో ఓ దశలో శివాజీరాజా తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారని, అయితే కొందరు వారించడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











