పవన్ కళ్యాణ్ 'తీన్ మార్' శాటిలైట్ రైట్స్ డిటేల్స్...
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్ మార్ శాటిలైట్ హక్కులను మా టీవీ వారు తీసుకున్నారు. ఈ రైట్స్ కోసం మిగతా ఛానెల్స్ నుంచి పోటీ వచ్చినా చిరంజీవికి,మా టీవీకి ఉన్న రిలేషన్ దృష్ట్యా దీనిని ఫ్యాన్సీ రేటుకు కాకుండా మార్కెట్ దృష్టిలో పెట్టుకుని ఇచ్చివేసినట్లు తెలుస్తోంది. ఇక మా టీవీ వారు కొత్తగా పెట్టిన మా మూవీస్ కోసం ఈ సినిమాను తీసుకున్నారు. త్రిష,పవన్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం బాలీవుడ్ హిట్ లవ్ ఆజ్ కల్ కి రీమేక్. త్రివిక్రమ్ రచన చేస్తున్న ఈ చిత్రాన్ని జయంత్ పరాంన్జీ డైరక్ట్ చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్ పతాకంపై హాస్య నటుడు గణేష్ దీనని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఆడియో మార్చి మొదటి వారంలో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టూడెంట్ గా కనిపంచనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











