ఆరున్నర కోట్లతో మంచు లక్ష్మీ ప్రసన్న సెట్

By Srikanya

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న తాజాగా ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆమె భారీగా ఖర్చుపెడుతున్నారు. ఆరున్నర కోట్ల రూపాయల వ్యయంతో ఆమె హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో ఓ సెట్ ను నిర్మిస్తున్నారు. బరోడా లోని లక్ష్మి విలాస్ ని పోలినట్లు ఈ సెట్ డిజైన్ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె చెన్నై నుంచి భూపేష్ అనే సెట్ డిజైనర్ ని రప్పించి,దాదాపు తొమ్మిది నెలల పాటు ఈ సెట్ ని నిర్మించారు. మంచు మనోజ్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం బాలకృష్ణ రాజమండ్రి వెళ్ళారు. నరసాపురం దగ్గరలో ఉన్న అంతర్వేదిలో ఈ చిత్రం షూటింగ్ జరగుతోంది. అక్కడ గోదావరి నదీ ప్రాంతాన షూటింగ్ చేస్తున్నారు.

ఈ విషయం లక్ష్మీ ప్రసన్న వివరిస్తూ... అంతర్వేది లక్ష్మీ నరసింహ దేవస్ధానం వద్ద జరిగే షూటింగ్ లో బాలకృష్ణ నాలుగు రోజులు పాల్గొంటారు. ఆయన పాత్ర సినిమాకు హైలెట్ కానుంది అని చెప్పారామె. ఈ చిత్రం 2012 వేసవిలో రిలీజ్ కానుంది. బేబో శశి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇక సెకెండాఫ్ ప్లాష్ బ్యాక్ లో వచ్చే బాలకృష్ణ పాత్ర కీలకమై నిలుస్తుందని వినపడుతోంది. మోహన్ బాబుకీ, బాలయ్యకీ ఉన్న అనుబంధంతో ఈ చిత్రంలో చేయటానికి కమిటయ్యాడని చెప్పుకుంటున్నారు. కొత్త తరహా కథ, కథనంతో ఈ స్క్రిప్టు రూపొందనుందని చెప్తున్నారు. ఊ కొడతారా..ఉలిక్కి పడతారా చిత్రాన్ని మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న.. తమ సొంత బ్యానర్ పై నిర్మించనుంది.

ఈ చిత్రం గురించి మనోజ్ మాట్లాడుతూ.. కృష్ణవంశీ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన రాజా దర్శకత్వంలో 'ఊకొడతారా..ఉలిక్కిపడతారా' అనే పేరుతో సంపూర్ణ హాస్య రసభరిత చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కామెడీ చిత్రాల్లో సరికొత్త ప్రయోగంలా ఆ చిత్రం వుంటుంది అని అన్నారు. బిందాస్ చిత్రంతో ఓకే అనిపించుకున్న మనోజ్ తర్వాత వచ్చిన వేదంతో నటుడుగానూ ప్రూవ్ చేసుకున్నారు. అలాగే ఈ చిత్రంలో దీక్షాసేధ్ హీరోయిన్ గా చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X